Success Mantra : కొందరు ప్రతిదానికి భయపడుతూ ఉంటారు. భయం అలవాటుగా మారినప్పుడు అది వ్యక్తి బలహీనతను దెబ్బతీస్తుంది. మీ జీవితానికి సంబంధించిన ఏదైనా భయం వస్తే అది మీ విజయానికి అడ్డుగా నిలుస్తుంది. వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరు ఏదో ఒక విషయంలో కచ్చితంగా భయపడతారు. కొందరు చీకటికి భయపడతారు. మరికొందరు ఎగ్జామ్స్ అంటే భయపడతారు. నిజంగా చెప్పాలంటే భయం అనేది వ్యక్తి జీవితంలో ఒక భాగం. కానీ భయపడడం అలవాటుగా మారినప్పుడు అది ఆ వ్యక్తి బలహీనత పై ఆధారపడి ఉంటుంది. అది ఆ మనిషి జీవితంలో వైఫల్యానికి పెద్ద కారణం అవుతుంది.
Success Mantra : ఈ ఐదు సూత్రాలు పాటిస్తే చాలు.
మీ జీవితానికి సంబంధించిన ఏదైనా భయం విజయానికి అడ్డుగా నిలిస్తే… దానిని అధిగమించు కోవడానికి ఈ సూత్రాలను పాటించడం చాలా మంచిది. ఈ విధమైన సంక్షోభం లేదా విపత్తు ఏర్పడిన అది మీ దగ్గరకి రానంతవరకు మాత్రమే భయపడాలి. అది మీకు ఎదురు వస్తే ఇటువంటి భయం సందేహం లేకుండా ఆలోచనలు వెతుక్కోవాలి. మీరు మీ భయాన్ని అదుపు చేసుకో లేకపోతే మరునాడు అభయం మిమ్మలను నియంత్రిస్తుంది. జీవితంలో భయాన్ని మీ దగ్గరికి రానివ్వకండి. అది మీ దగ్గరికి వచ్చిన మీరు భయపడకుండా ఆ పనిలో ముందుకు వెళ్లే ప్రయత్నం చేయండి.

భయంతో జీవితంలో దక్కునే ప్రయత్నం చేయకండి. బలంగా ఎదుర్కొండి. ఒక వ్యక్తి తనలోనే భయాన్ని జయించుకోవాలనుకుంటే ఆ ఇంట్లో కూర్చొని భయం గురించి ఎప్పుడూ ఆలోచించకండి. దాని నుండి బయటపడడానికి ఆలోచనలు వెతికి దానిని తరిమేయండి. మనిషి ఆలోచనల నుంచి జీవితంలో భయం తరచుగా పుడుతుంది. మనం ఏదైనా పని చేయాలంటే దీనిని భయంగా ఫీల్ అవుతుంటే ఆ పనిని మనం పూర్తి చేయలేము.