Pavithra Lokesh : సీనియర్ హీరో ప్రముఖ క్యారెక్టర్ నటుడు నరేష్, సీనియర్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ పవిత్ర లోకేష్ గత కొంతకాలంగా తరచూ వార్తల్లో నిలుస్తున్నారు. వీరిద్దరూ గత ఐదు ఆరు నెలల నుంచి ఎంతగా వార్తల్లో వస్తున్నారు చూస్తూనే ఉన్నాం. నరేష్ తో పవిత్ర లోకేష్ డేటింగ్ లో ఉన్నారని వార్తలతో ఆమె బాగా హాట్ టాపిక్ గా మారింది. అయితే అటు నరేష్ ఇటు పవిత్ర ఇద్దరు కూడా తమ చుట్టూ ఎన్ని వివాదాలు ఉన్న అవేమి పట్టించుకోకుండా తమ కెరీర్ లో తాము బిజీగా ఉన్నారు. అందరూ ఊహించని విధంగా వీరిద్దరూ సినిమాలలో నటిస్తున్నారు. బాగా కాంట్రవర్సీ అయ్యాక మరింత పాపులర్ అవుతుండటం తో పాటు అవకాశాలు కూడా ఎక్కువగా అందిపుచ్చుకుంటున్నారు. ప్రస్తుతం పవిత్ర బాగా పాపులర్ కావడంతో వరుస సినిమాలు చేస్తుంది.
పవిత్ర లోకేష్ క్రేజ్ పెరగడంతో గతంతో పోలిస్తే తన రెమ్యూనరేషన్ కూడా పెంచేసినట్లు తెలుస్తుంది. పవిత్ర, నరేష్ మధ్య ఏజ్ డిఫరెన్స్ 20 సంవత్సరాలకు పైనే ఉంటుంది. నరేష్ వయసు 63 కాగా పవిత్ర లోకేష్ వయసు 40,45 మధ్యలో ఉంటుంది. నరేష్ ఇప్పటికే మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు, పవిత్ర కూడా ఇంతకుముందే రెండు పెళ్లిళ్లు చేసుకుంది. అయితే వీరిద్దరూ అగ్రిమెంట్ ప్రకారం సహజీవనం చేస్తున్నారని గుసగుసలు సిని వర్గాల్లో వినిపిస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా పవిత్ర లోకేష్ ఓ స్టార్ హీరో సినిమాలో నటించేందుకు అవకాశం దొరికింది.
Pavithra Lokesh : ఆ స్టార్ హీరో అంత మాట అనేసాడేంటి…

తాజాగా పవిత్ర లోకేష్ ఓ స్టార్ హీరో సినిమాలో నటిస్తుండగా ఈ మూవీ సెట్స్ లో ఆమెకు అవమానం జరిగిందన్న వార్తలు సినీ వర్గాల్లో వినిపిస్తున్నాయి. పవిత్ర లోకేష్ ను తన సినిమా నుంచి తప్పించాలని ఆ స్టార్ హీరో దర్శకుడికి సూచించారంట. ఇదంతా ఆమె స్టేట్స్ లో ఉండగానే జరిగిందంట. దీంతో ఈ విషయం బయటకు వచ్చేసింది. దీంతో దర్శకుడికి పవిత్రను తప్పించడం ఇష్టం లేకపోయినా ఆమెకు బదులుగా మరొకరిని తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ఆ హీరో సూచన మేరకే దర్శకుడు పవిత్రను ఆ సినిమా నుంచి తప్పించడంతో మరో సీనియర్ ఆర్టిస్టును ఆమె స్థానంలో తీసుకోవాలని నిర్ణయించుకున్నారట. ఏదేమైనా నరేష్ తో పవిత్ర లోకేష్ కు ఓవైపు క్రేజ్ పెరుగుతుంటే, మరోవైపు ఆమెకు మైనస్ గా మారినట్లు తెలుస్తుంది.