Viral News : గుప్త నిధులు అనే మాటను మీరు విని ఉంటారు కదా. ఒకప్పుడు బ్యాంకులు గట్రా ఏం లేవు. ఆ సమయంలో డబ్బు, బంగారం లాంటి విలువైన వాటిని దాచుకోవడానికి జనాలు వాటిని ఎక్కడైనా తెలియని చోట దాచిపెట్టేవారు. వాటిని అవసరం ఉన్నప్పుడు తవ్వి తీసుకునేవారు. కొందరు వాటిని మరిచిపోవడం, లేదా దాచిన వాళ్లు చనిపోవడం వల్ల అవి గుప్త నిధుల్లా మారి చివరకు చాలా ఏళ్ల పాటు అవి అలాగే అక్కడే ఉండిపోతాయి. ఎప్పుడో వందల ఏళ్ల తర్వాత అవి తవ్వకాల్లో బయటపడటం.. అవి దొరికిన వాళ్ల పంట పండటం జరుగుతుంటాయి.

కొందరు నిధుల గురించి తెలుసుకొని ఆ చోట తవ్వకాలు కూడా జరుపుతుంటారు. అటువంటి వార్తలు కూడా మనం ఎన్నో చూశాం. లంకె బిందెలు అంటూ కొందరికి తవ్వకాల్లో దొరకడం కూడా చూస్తూనే ఉంటాం కదా. తాజాగా ఏపీలోని విజయనగరం జిల్లా రాజాంలో ఓ ఐరన్ లాకర్ హల్ చల్ చేసింది.
Viral News : ఓ ఇంటి గోడలో దాచి పెట్టిన ఐరన్ లాకర్ అది
రాజాంలో ఉన్న ఓ పురాతన ఇంటిని కూలుస్తున్న సమయంలోనే ఆ లాకర్ బయటపడింది. కూలీలు ఆ ఇంటిని పగులగొడుతుండగా ఆ లాకర్ బయటపడింది. కానీ.. ఆ ఇంటి యజమానికి చెప్పకుండా దాచారు. కానీ.. ఆ విషయం ఆనోటా ఈనోటా చివరకు యజమానికి చేరింది. ఆ లాకర్ లో 2 కిలోల బంగారం ఉందని ప్రచారం చేశారు. గుప్త నిధులు ఉన్నాయి.. బంగారు ఆభరణాలు ఉన్నాయంటూ వార్తలు గుప్పుమన్నాయి.
దీంతో ఆ లాకర్ నాది అంటూ యజమాని కూలీలతో గొడవకు దిగాడు. కానీ..వాళ్లు అతడికి ఆ లాకర్ ను అస్సలు ఇవ్వలేదు. చివరకు ఈ విషయం పోలీసులకు తెలియడంతో వాళ్లు దాన్ని స్వాధీనం చేసుకొని అందరి సమక్షంలో దాన్ని ఓపెన్ చేయించారు. దాన్ని ఓపెన్ చేసి చూసి అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే అందులో ఉన్నది తుక్కు కాగితాలు, మూడు నాణేలు. ఆ నాణేలు బంగారపువి అనుకునేరు. అవి 50 పైసలు, 10 పైసలు, 5 పైసల బిళ్లలు. మిగితావి అంతా తుక్కు కాగితాలే. వాటిని చూసి అందులో ఏముందో అని చూడటానికి వచ్చిన జనాలు అవాక్కయ్యారు.