Venkatesh : విక్టరీ వెంకటేశ్ తన పేరులోనే విజయం పెట్టుకున్న వెంకటేశ్ ఎప్పుడు కొత్తదనం తో దుసుకువెళ్ళతు ఉంటాడు. మూవీ మొగల్ Dr డి. రామానాయుడు కొడుకు అయినప్పటికీ విక్టరీ వెంకటేష్ గానే తెలుగు ప్రేక్షకులకి అందరికీ బాగా దగ్గరైన వ్యక్తి. కామిడీ అయిన యాక్షన్ అయిన పాత్రకు తగ్గట్టుగా ఒదిగి పోవటం లో వెంకటేష్ కు వెన్న తో పెట్టిన విద్య. ఇప్పుడు ఆయన కొత్తగా F2 ఇంకా F2 సీక్వెల్ గా వచ్చిన f3 సినిమాలో తనదైన ముద్రలో కనిపించి ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాడు. వరుస విజయాలతో దూసుకెళ్తన్న ఈ సీనియర్ హీరో కొత్తగా మెగాస్టార్ తో మల్టీ స్టారర్ మూవీ తో ప్రేక్షకుల ముందుకు రావలి అని అనుకుంటున్నడు.
ఆచార్య మూవీ తర్వాత మెగాస్టార్ చిరంజీవి ఒక్కసారి ఆగి ఆలోచించడం మొదలుపెట్టాడు. ఆచార్య మూవీ మెగాస్టార్ తనయుడు అయినటువంటి రామ్ చరణ్ తో కలిసి తీయడం జరిగింది. కానీ ఈ సినిమా అంతగా ప్రేషకులలోకి వెళ్ళలేదు. కాబట్టి మెగాస్టార్ చేయబోయే ప్రాజెక్టుల విషయం లో కొత్త డైరెక్టర్స్ తో కాకుండా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి అనుకున్నట్లు సమాచారం. అయితే వెంకటేష్ మరియు చిరు కాంబినేషన్ లో కుడుములు మూవీ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

మెగాస్టార్ మరియు విక్టరీ వెంకటేష్ కాంబినేషన్ లో చిరంజీవి కుడుములు అనే సినిమా ను తెరకు వేకించటానికి వెంకటేష్ స్క్రిప్ట్ రెఢీ చేసుకుంటున్నట్లు సమాచారం. ఒక్కసారిగా మెగాస్టార్ ఈ ఆలోచనతో కుడుములు సినిమా వాయిదా పడినట్లే నా అని సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు. కానీ వెంకీ కుడుములు టీమ్ మాత్రం చిరు తో ఈ సినిమా కచ్చితంగా ఉంటుంది అని చెపుతున్నారు. అంతే కాకుండా వెంకీ ఈ సినిమాకు సంబంధించి స్క్రిప్టును రెడీ చేసి, చిరంజివి కి వినిపించిన తర్వాత ఆయన తో చర్చలు జరిపి తదుపరి సినిమాకు సంబంధించి భవిష్యత్ కార్యాచరణ పై నిర్ణయం తీసుకుంటారు అని సమాచారం. ప్రస్తుతం కుటుంబం తో మెగాస్టార్ సమ్మర్ అకేషన్లో విదేశాలలో ఉన్నట్లు సమాచారం. అక్కడినుంచి వచ్చిన తరవాత నే ఒక నిర్ణయానికి వస్తారు అని అనుకుంటున్నారు. కానీ వెంకీ చిరు కాంబినేషన్లో మూవీ మాత్రం ఉంటుంది అని సినీ వర్గాలు చర్చించు కుంటున్నాను.