Ganesha Pooja : మనం ఇంట్లో ఏ శుభకార్యం చేయాలన్న గణపతి ఆరాధన చేయాలి. దేవుని అనుగ్రహం ఉంటేనే ఏ కార్యం తలపెట్టిన విఘ్నాలు కల్గకుండా దిగ్విజయంగా పూర్తవుతుంది. దేవాది దేవతల్లోకేల్లా గణాదిపతుడు. ముక్కోటి దేవాది దేవతలు సహితం గణపతిని పూజించనదే ఏ కార్యం కూడా తలపెట్టరు. గణపతికి పలు రూపాలు కూడా ఉంటాయి. గణపతిని ఆరాధించే ముందు గణపతి శ్లోకంను తప్పక పటించాలి.
32 రకాల గణపతుల ఆరాధన చేస్తారు. పసుపుతో చేసిన గణపతిని పూజ గదిలో ఉంచి ప్రతి రోజు పూజించడం వలన సమస్త రోగాలు ప్రభలకుంటా కపాడుతాడు. ఇంకా ధన, కనక , వస్తూ, వాహన, వృత్తి వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. గణపతి పూజతోపాటు, గౌరీదేవి పూజించడం వలన పెళ్లికానీ వరుడు లేదా వధువు కి వివాహా యోగం కలుగును. మహిళలకు సౌభాగ్యం కలుగును. పగడపు గణపతిని పూజించడం వలన సంపూర్ణ ఆరోగ్యం కలుగుతుంది. ఈ పగడపు గణపతిని వల్ల నరదిష్టిని నుంచి కాపాడుతుంది. మరకత గణపతిని పూజించడం వల్ల జ్ఞాపక శక్తి పెరుగుతుంది.

ఈ గణపతి ని పూజించడం వలన బిజినెస్ కూడా అభివృద్ది చెందుతుంది. చందనం గణపతిని పూజించడం వల్ల సంఘంలో గౌరవం, ఉద్యోగంలో ఉన్నత స్థాయి కలుగుతుంది. స్ఫటిక గణపతి పూజించడం వల్ల దంపతుల మధ్య గొడవలు, సుఖజీవితం కలుగుతుంది. నల్లరాతి గణపతి అధిక శ్రమ నుంచి విముక్తి జరుగును. శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు చెట్టు ఇంట్లో పెడితే ఇక వారికి దారిద్య్ర బాధలు ఉండవు. ఇలా గణపతిని పూజించడం వలన విగ్నాలు లేకుండా సకలకార్యాలు సిద్ధించును..