Beauty Tips : ముఖ సౌందర్యాన్ని పెంచే ముల్తానీ మట్టి…. దాని వల్ల ప్రయోజనాలు ఎన్నో.

Beauty Tips : మీ అందాని రెట్టింపు చేయడానికి ముల్తానీ మట్టి మంచి ఔషధంగా పనిచేస్తుంది. ముల్తాన్ మట్టి లో పోషకాలు, ఖనిజాలు, ముఖ .సౌందర్యాన్ని పెంచడానికి ఉపయోగపడతాయి. అయితే ముల్తానీ మట్టి తో ఇంట్లోనే ఫేస్ ప్యాక్ తయారు చేసుకోవచ్చు. ముల్తానీ మట్టి వల్ల అనేక రకాల ప్రయోజనాలు ఉన్నాయి. ముల్తానీ మట్టి తో నాచురల్ ప్యాక్ ని చేసుకోవచ్చని సౌందర్య నిపుణులు తెలియజేశారు.ముల్తానీ మట్టి తో అందం రెట్టింపు చేయడానికి కలిగే ప్రయోజనాల గురించి తెలుసుకుందాం.ముల్తాని మట్టితో చేసుకునే ఫేస్ ప్యాక్ లు శరీరానికి ఎటువంటి హాని కలగకుండా చర్మాన్ని మెరిసేలా చేస్తాయి. వీటిలో ఉండే మలినాలను తొలగించి శరీర సమస్యలను, మొటిమలను, మచ్చలను, చర్మం పై వచ్చిన వలయాలను, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ ను తొలగిస్తాయి.

Advertisement

ఇది చాలా మంచి బ్యూటీ ప్యాక్. ముల్తానీ మట్టిని చర్మంపై క్లీనింగ్ ఏజెంట్ గా ఉపయోగిస్తున్నారు . పొడిబారిన శరీరానికి తేమను అందించి చర్మం మెరిసేలా కాంతివంతంగా చేస్తుంది చర్మంలో ఉన్న జిడ్డును తొలగించి చర్మానికి మంచి రంగును చూసిస్తుంది. ముల్తానీ మట్టి పేస్ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముల్తాని మట్టిలో రోజ్ వాటర్ కలిపి దానిని ముఖంపై మర్దనా చేసి. ఇరవై నిమిషాల తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల ముఖ చర్మం పై ఉన్న నల్లటి మచ్చలు, మొటిమలను, డెత్ స్కిన్ సెల్స్ ని తగ్గిస్తాయి. ముల్తానీ మట్టి క్లెన్సర్ గా పనిచేస్తుంది.దీనిలో ఎక్కువగా మెగ్నీషియం, క్లోరైడ్ ఉంటాయి కావున ముఖం పై ఉన్న నల్లటి మచ్చలు, మొటిమలు తగ్గుతాయి.

Advertisement

Beauty Tips : ముఖ సౌందర్యాన్ని పెంచే ముల్తానీ మట్టి.

Multani clay that enhances facial beauty
Multani clay that enhances facial beauty

ఓపెన్ ఫోర్స్ లో పేరుకుపోయిన డెత్ స్కిన్ సుని తొలగించి చర్మం మెరిసేలా చేస్తుంది. జిడ్డు చర్మం ఉన్నవారికి ఈ ప్యాక్ బాగా ఉపయోగపడుతుంది. ఈ ప్యాక్ ని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముల్తానీ మట్టిని రెండు స్పూన్లు, పెరుగు ఒక స్పూన్, తీసుకొని దానిలో నిమ్మరసం రెండు మూడు చుక్కలు వేసి చిటికెడు పసుపును తీసుకొని బాగా కలపాలి. ఇలా కలిపిన మిశ్రమాన్ని ముఖాన్ని శుభ్రం చేసి మర్దనా చేయాలి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా వారంలో రెండు మూడు సార్లు చేసుకోవడం వల్ల ముఖ రంధ్రాల్లో పేరుకుపోయిన జిడ్డు పోయి చర్మం కాంతివంతంగా తయారవుతుంది.ఈ ప్యాక్ ఎండ కారణంగా నల్లబడ్డ చర్మాన్ని కాంతివంతంగా చేస్తుంది. ఒక్క స్పూన్ ముల్తాని మట్టిని తీసుకుని దానిలో రెండు స్పూన్ల ఆలుగడ్డ రసాన్ని వేసి ముఖంపై మర్దన చేసి పదిహేను నిమిషాల తర్వాత శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే చర్మానికి మంచి రంగు వస్తుంది.

Advertisement