Mutton Curry : మాసాలాలు ఎక్కువ‌గా వాడ‌కుండ సూప‌ర్ టేస్టిగా మ‌ట‌న్ క‌ర్రి

Mutton Curry : మనం సాధారణంగా చికెన్, మటన్, చేపలను బాగా ఇష్ట పడి తింటాం. అయితే చేపలు కొంతమంది తినడానికి ఇష్టపడరు . చేపల కూరలో ముళ్ళు ఉంటాయని తినడం భయపడి తినరు. అలాగే చికెన్ కూడా వేడి చేస్తుంది అని దానిని కూడా సరిగా తినటానికి ఇష్టపడరు . అదే మటన్ అయితే చాల ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అయితే మటన్ లో మసాలాలు ఎక్కువ వాడటం వల్ల జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయి అని తినటానికి భయ పడుతుంటారు. మనకి ఇష్టమైన మటన్ ఈజీగా మాసాలు ఎక్కువగా వాడకుండా చాలా టేస్టీగా ఎలా చేయాలో చూద్దాం.

Advertisement

కావలసిన పదార్దాలు : 1కేజీ మటన్, ఆయిల్, 2బిర్యానీ ఆకులు, 4యాలకులు, 4లవంగాలు, 1 దాల్చినచెక్క, పచ్చిమిర్చి, వెల్లుల్లి, ఉల్లిపాయలు, అల్లంవెల్లుల్లి పేస్ట్, కారం, ఉప్పు, ధనియా పౌడర్, జీలకర్ర కొద్దిగా, కొత్తిమీర, పసుపు వాటర్ ఇవ్వని సిద్ధం గా పెట్టుకోవాలి.

Advertisement

Mutton Curry : తయారీ విధానం…..

Mutton Curry as a super tasty without using too much of spices
Mutton Curry as a super tasty without using too much of spices

స్టవ్ మీద ఒక కడాయి పెట్టి దానిలో తగినంత ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తరువాత 2 బిర్యానీ ఆకులను, 4యాలకలు 4లవంగాలు, 1దాల్చిన చెక్క, ఒక టీ స్పూన్ షాజీరా ఇలా ఒక దాని తరవాత ఒకటి వెయ్యాలి. ఇవి కొంచం వేగిన తరువాత ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని బాగా ఫ్రై అయినా తరువాత కొంచం పసుపు వేసుకొని తరువాత శుభ్రంగా కడిగిన మటన్ వేసుకొని దానిని బాగా మగ్గనివ్వాలి. మగ్గిన తరువాత దానిలో రుచికి సరిపడినంత ఉప్పు వేసుకోవాలి. తరువాత 3 స్పూన్లు కారం వేసుకోవాలి కొద్దీ సేపు మూత పెట్టి ఉంచాలి తరువాత మూత తీసి ధనియా పౌడర్, కొంచం జీలకర్ర పౌడర్ వెయ్యాలి. తరువాత 2గ్లాసుల వాటర్ వేసుకొని 20 మినిట్స్ బాగా ఉడికించుకోవాలి. సూప్ దగ్గరగా అయినా తరువాత కొత్తిమీర వేసుకొని దించుకోవాలి. అంతే మసాలాలు ఎక్కువగా వాడకుండా మటన్ కర్రీ రెడీ.

Advertisement