Sudha Chandran : నెంబర్‌.1 కోడలు సీరియల్ నటి వాగ్దేవి బయోగ్రఫీ

Sudha Chandran : జీ తెలుగు లో ప్రసారమయ్యే నెంబర్.1 కోడలు సీరియల్ లో వాగ్దేవి పాత్రలో నటించిన సుధాచంద్రన్ అందరికీ సుపరిచితురాలు.సుధా చంద్రన్ కేవలం తెలుగు మాత్రమే కాదు, ప్రముఖ హిందీ చిత్రాల్లో, సీరియల్స్ లో తన నటనను చాటుకుంది. సుధా చంద్రన్ 1964 సెప్టెంబర్ 21 న జన్మించింది.ఆమె భర్త పేరు రవి దంగ్, సుధా చంద్రన్ నటి మాత్రమే కాదు, ఒక నృత్య కళాకారిణి.
సుధా చంద్రన్ కి ఒక్కటే శాపం లాంటి లోపం తనకు కుడి కాలు లేకపోవడం, ఒక యాక్సిడెంట్ లో జరిగిన గాయం వలన ఇన్ఫెక్షన్ సోకి తన కాలు ను కోల్పోయింది.

Advertisement

ప్రముఖ భరతనాట్య డ్యాన్సర్ అయిన సుధాచంద్రన్ నీ ఆ పరిస్థితుల్లో చూసిన తన అభిమానులు,కుటుంబం, స్నేహితులు ఎంతో తల్లడిల్లారు, కానీ సుధా చంద్రన్ మాత్రం అందరిలా తన లోపానికి డీలా పడలేదు తన భరతనాట్యాన్ని తిరిగి ప్రారంభించాలని పట్టుదలతో కృత్రిమమైన జైపూర్ ఫుట్ తగిలించుకొని సరిగ్గా రెండేళ్లలో తిరిగి భరతనాట్యం ప్రాక్టీస్ చేసింది , ఆ తరువాత అదే కాలుతో యూరప్‌, కెనడా లో తన డ్యాన్స్తో జనాన్ని మంత్రముగ్ధుల్ని చేసింది. ఆమె జీవితం ఎంతో మందికి ఆదర్శం కావాలని ఆమె జీవిత చరిత్రను అప్పట్లో పదవ తరగతి ఇంగ్లిష్ టెస్ట్ లో పాఠంగా కూడా చేరింది, కథ ఎంతో ఇన్స్పైరింగా ఉండటంతో తెలుగు దర్శకుడు సింగీతం శ్రీనివాస్ ఆమె జీవిత కథను మయూరి సినిమాగా ఉషాకిరణ్ బ్యానర్పై రామోజీరావు ఈ సినిమాను నిర్మించారు.

Advertisement

Sudha Chandran : ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది

No.1 Kodalu Serial Actress Vagdevi Biography
No.1 Kodalu Serial Actress Vagdevi Biography

ఎస్పీ బాలసుబ్రమణ్యం గారి సంగీతంతో ఈ సినిమా పాటలన్నీ అప్పట్లో చాలా సూపర్ హిట్ అయ్యాయి ,జీవితంలోని కొన్ని అంశాలు తీసుకుని దానికి ప్రేమ, కాలు కోల్పోయిన సన్నివేశాన్ని కల్పితంగా యాడ్ చేసి చివరికి తన డ్యాన్స్తో తను ప్రేమించిన వాడికి బుద్ది చెబుతూ క్లైమాక్స్ ని ముగించారు అప్పట్లో ఈ సినిమా తెలుగులో సంచలన విజయం సాధించింది ఈ సినిమాను మలయాళం, తమిళం, హిందీ పలు భాషల్లో కూడా రూపొందించారు. తొలి సినిమాతోనే స్పెషల్ జ్యూరీగా నేషనల్ అవార్డుని సుధాచంద్రన్ సొంతం చేసుకుంది. తన కాలు ను పోగొట్టుకోక ముందు కేవలం సీరియల్స్ లో నటించి, నాట్యంలో గుర్తింపు సాధించింది, కానీ యాక్సిడెంట్ తర్వాత మయూరి సినిమాతో, సినిమాల్లో తన కెరియర్ ను ప్రారంభించి నలభై అయిదు సినిమాలకు పైగా నటించింది.తన కాలిని కోల్పోవడాన్ని బలహీనతగా భావించకుండా ఎంతో ధైర్యంగా ఉండి ఎంతో మందికి స్ఫూర్తిదాయకంగా నిలిచింది సుధా చంద్రన్.

Advertisement