Bigg Boss 7 : బిగ్ బాస్ సీజన్ 7 నాలుగో వారంలో హాట్ బ్యూటీ రతిక ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే రతీక ఎలిమినేట్ అయినదాని కంటే శివాజీకి అన్యాయం జరిగిందని మాట్లాడే వారు ఎక్కువ. అయితే బిగ్ బాస్ హౌస్ లో సంచాలకులుగా వ్యవహరిస్తున్న శివాజీ, సందీప్, శోభ పక్షపాతంగా ఉన్నారని విమర్శలు వచ్చాయి. ఇక శోభ , సందీప్ పూర్తిగా సీరియల్ బ్యాచ్ చెప్పినట్లు ఆడుతూ ఉండటంతో ఆడియన్స్ తెగ తిట్టుకున్నారు. అలాగే నాగర్జున కూడా సంచాలకుడిగా నువ్వు 100 శాతం ఫెయిల్ అంటూ సందీప్ మొహం పైనే చెప్పుకొచ్చారు.
కానీ సందీప్ ను సంచాలకుడిగా ఉంచి శివాజీని మాత్రం సంచాలకుడిగా తప్పించారు. దీంతో ఇదేం అన్యాయం అంటూ ప్రేక్షకులు శివాజీకి మద్దతుగా నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే నామినేషన్ తర్వాత ప్రశాంతతో మాట్లాడుతూ శివాజీ కాస్త ఎమోషనల్ అయ్యారు. నేను ఏదైనా తప్పు చేసి ఉంటే నన్ను హెలిమినేట్ చేసేయండి నాకు ఓట్లు వేయకండి అంటూ శివాజీ మాట్లాడారు. ఆ తర్వాత హౌస్ మేట్ గా ఉండటానికి అనర్హుడు ని అని చెప్పిన కంటెస్టెంట్స్ కు ఇచ్చి పడేశారు. అయితే ఐదో వారం నామినేషన్ లో శివాజీ ,యావర్ ,అమర్దీప్ ,ప్రియాంక, శుభశ్రీ,గౌతమ్ కృష్ణ, టేస్టీ తేజ ఉన్నారు.
అయితే శివాజీకి జరిగిన అన్యాయం ప్రేక్షకులకు నచ్చలేదు కాబోలు. అందుకే మొదటి రోజే శివాజీకి భారీ స్థాయిలో ఓట్లు గుద్దారు. దీంతో శివాజీ ఇప్పటికే 50 శాతం ఓట్ల తో ముందంజలో ఉన్నాడు.ఆ తర్వాత ప్రిన్స్ యావర్ 14 శాతం , అమర్దీప్ 9 శాతం ,గౌతమ్ కృష్ణ 8 శాతం , ప్రియాంక 7 శాతం, శుభశ్రీ 6 శాతం , టేస్టీ తేజ 5 శాతం ఓటింగ్ తో ఉన్నారు. ఇక ఈసారి డేంజర్ జోన్ లో టేస్టీ తేజ కనిపిస్తుండగా ఎలిమినేషన్ టైంకి ఓటింగ్ తార్ మార్ అయ్యే అవకాశం ఉంది. అయితే ఈసారి స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ ఎలిమినేషన్ లో ఉండడంతో 5 వారం ఎలిమినేషన్స్ చాలా ఆసక్తికరంగా ఉండబోతుంది అని అర్థమవుతుంది.