Reserve Bank : తాజాగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2000 నోట్లను రద్దు చేసిన సంగతి తెలిసిందే. దీనికి కారణం కూడా అందరికీ తెలిసిందే. 2000 నోట్లు ఎక్కువగా వాడుకలో లేకపోవడంతో వీటిని రద్దు చేశారు. అయితే తాజా సమాచారం ప్రకారం రిజర్వ్ బ్యాంక్ 500 నోట్లను కూడా రద్దు చేయబోతుందట. ఇప్పుడు ఆర్బిఐ కి రెండు కొత్త సమస్యలు వచ్చాయి. ఒకటి 500 నోట్ల కొరత, రెండవది నకిలీ 500 నోట్లు. ఎప్పుడైతే 200 నోట్లను ఆర్బిఐ రద్దు చేసిందో అప్పుడు ఆ నోట్లను అక్రమంగా దాచుకున్నవారు ఇప్పుడు వాటిని మార్చుకొని 500 నోట్లను తీసుకుంటున్నారు.
ఇలా దేశవ్యాప్తంగా రోజు వేలకోట్ల రూపాయల 500 నోట్లు మాయమవుతున్నాయి. ఎప్పుడైతే 2000 ఆర్బిఐ రద్దు చేసిందో వెంటనే 500 నోట్లకు డిమాండ్ నాలుగు రెట్లు పెరిగింది. దీంతో ప్రజల అవసరాన్ని దృష్టిలో పెట్టుకొని నకిలీ నోట్లు తయారు చేసే వాళ్ళు రెడీ అయిపోయారు. ఇష్టం వచ్చినట్లు 500 నోట్లను నకిలీవి తయారుచేసి దేశవ్యాప్తంగా మార్పిడి చేస్తున్నారు. దీనివల్ల ఇండియాలో 500 నోట్లలో ఏది నిజమైందో, ఏది నకిలీదో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నకిలీ నోట్లోను పాకిస్తాన్ లో ముద్రిస్తున్నారు. వాటిని నేపాల్, బంగ్లాదేశ్ వైపు నుంచి ఇండియాలోకి తరలిస్తున్నారు. దీనికోసం రకరకాల మార్గాలను వెతుకుతున్నారు.

ప్రస్తుతం రిజర్వ్ బ్యాంక్ ముద్రించిన నోట్ల కంటే 20 శాతం ఎక్కువగా 500 నోట్లు చెలామణిలో ఉన్నాయి. దీనివలన భారత ఆర్థిక వ్యవస్థ చిక్కుల్లో పడుతుంది. ప్రపంచవ్యాప్తంగా భారత్ పట్ల నమ్మకం పోతుంది. అందుకే 500 నోట్లను కూడా రద్దు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆలోచిస్తున్నట్లు సమాచారం. త్వరలోనే రిజర్వ్ బ్యాంక్ 500 నోట్లు రద్దు చేస్తుందని ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాకపోయినా చాలామంది రద్దు చేయడమే మంచి