Sara Tendulkar – Ram Charan : రామ్ చరణ్ సరసన సచిన్ టెండుల్కర్ కూతురు .. ఏ సినిమా అంటే..??

Sara Tendulkar – Ram Charan  : బాలీవుడ్ మీడియాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గురించి ఒక క్రేజీ న్యూస్ వైరల్ గా మారింది. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీతో కలిసి రాంచరణ్ సినిమా చేయబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ సినిమా కి హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం లేని అమ్మాయిని పెడితే బాగుంటుందని డైరెక్టర్ ఫిక్స్ అయ్యారట. ఈ క్రమంలోనే రామ్ చరణ్ కి జోడిగా సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ నటించబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

Advertisement

sara-tendulkar-act-in-ram-charan-movie

Advertisement

ఇప్పటికే పలుమార్లు సచిన్ టెండూల్కర్ రాజ్ కుమార్ హిరానీతో చర్చలు జరిపి తన కూతురిని ఇండస్ట్రీకి పరిచయం చేయాలని చెప్పారట. ఇక సచిన్ వచ్చి స్వయంగా అడగడంతో మంచి కథ వచ్చినప్పుడు చెబుతాను అని డైరెక్టర్ మాట ఇచ్చారట. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తో చేయబోయే సినిమాలో హీరోయిన్ గా సారా టెండూల్కర్ ను పరిచయం చేయాలని రాజ్ కుమార్ భావిస్తున్నారట. ప్రస్తుతం ఈ న్యూస్ వైరల్ కావడంతో ఈ వార్త నిజం అవ్వాలని రామ్ చరణ్ అభిమానులతో పాటు సచిన్ టెండూల్కర్ అభిమానులు కూడా భావిస్తున్నారు.

ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ శంకర్ డైరెక్షన్లో ‘ గేమ్ ఛేంజర్ ‘ సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఈ సినిమా అయిపోయిన తర్వాత వెంటనే ఉప్పెన డైరెక్టర్ బుచ్చిబాబుతో ఓ సినిమా చేస్తారని అఫీషియల్ గా ప్రకటించారు. అయితే బుచ్చిబాబుతో సినిమా చేస్తూనే మరోవైపు బాలీవుడ్ లో కూడా సినిమా చేయాలని రామ్ చరణ్ భావిస్తున్నారట. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హీరోయిన్గా సారా టెండూల్కర్ ను ఎంపిక చేసినట్లు సమాచారం. ఇక సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటారు. ఆమెకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింటా ట్రెండ్ అవుతూ ఉంటాయి.

Advertisement