అవినాష్ రెడ్డికి షాక్ – హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధించిన సుప్రీంకోర్టు

వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి తాత్కాలిక బెయిల్ మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను కొట్టివేయాలని సుప్రీంకోర్టును ఆశ్రయించారు సునీతా. ఆమె దాఖలు చేసిన పిటిషన్ పై శుక్రవారం విచారణ చేపట్టిన సుప్రీంకోర్టు అవినాష్ రెడ్డికి ఇచ్చిన తాత్కాలిక బెయిల్ ఉత్తర్వుల మీద స్టే విధించింది. తాము ఈ కేసును పూర్తిగా విచారిస్తామని స్పష్టం చేసింది.

Advertisement

అయితే హైకోర్టు ఇచ్చిన తాత్కాలిక బెయిల్ ఉత్తర్వులపై సుప్రీంకోర్టు ధర్మాసనం స్టే విదించడంతో సీబీఐ వెంటనే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేసే వెసులుబాటు ఉంటుంది. దాంతో సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి తరుఫు న్యాయవాదులు తమ వాదనలు వినే వరకు ఈ కేసులో అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా చూడాలని ధర్మాసనాన్ని అభ్యర్థించారు.

Advertisement

సునీత పిటిషన్ లో ఏముందో తమకు తెలియదని, అందువల్ల పేపర్ బుక్ తమ వద్ద ఉంటె అవినాష్ రెడ్డి తరుఫున వాదనలు వినిపించే వారమని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్ళారు. అవినాష్ రెడ్డి తరుఫు వాదనలు వినే వరకు తమ క్లైంట్ ను అరెస్ట్ చేయకుండా చూడాలని కోరారు. దాంతో ఈ నెల 24వరకు అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయవద్దని సీబీఐని ఆదేశించిన సుప్రీంకోర్టు… ఈ కేసును సోమవారం విచారిస్తామని వాయిదా వేసింది.

సుప్రీంకోర్టులో కూడా ఊరట కలగడంతో మరో మూడు రోజులపాటు అవినాష్ రెడ్డికి అరెస్ట్ భయం లేదు. అయితే ఈ నెల 25న హైకోర్టు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్ పై తుది తీర్పును వెలువరించనుంది. అంతకుముందు రోజే సుప్రీంకోర్టు సునీత రెడ్డి పిటిషన్ పై పూర్తి స్థాయి విచారణ చేపట్టనుంది. సుప్రీంకోర్టులో అవినాష్ రెడ్డి అరెస్ట్ కు సంబంధించి ఎలాంటి తీర్పు వస్తుందని ఏపీ రాజకీయ వర్గాలు ఆసక్తిగా చూస్తున్నాయి.

Advertisement