Millat Noodles : న్యూడిల్స్ అంటే తిననివారు, తెలియని వారు ఎవరూ లేరు కానీ మైదా లేని న్యూడిల్స్ గురించి మీలో ఎంతమందికి తెలుసు ?

Millat Noodles : చైనా ఫాస్ట్ ఫుడ్ లో దొరికే న్యూడిల్స్ అంటే చిన్న పిల్లలకి, పెద్దలకి అందరికీ చాలా ఇష్టం, కానీ ఈ న్యూడిల్స్లో మైదా,ప్రిజర్వేటివ్స్ ఉంటాయి. వాటి వల్ల మునుముందు ఆరోగ్యానికి చాలా ప్రమాదం. మైదాను మనం ఎంత తక్కువగా వాడితే మన ఆరోగ్యానికి అంత మంచిది.మరీ చిన్న పిల్లలకి మైదాతో చేసినవి పెట్టడం మంచిది కాదు, కానీ న్యూడిల్స్ తినని వారు లేరు అలాంటప్పుడు ఎలా? మైదా లేని న్యూడిల్స్ ఉంటే ఎంత మంచిదండి, టేస్ట్కి టేస్ట్, ఆరోగ్యానికి ఆరోగ్యం, ఇంతకంటే మనకి కావల్సింది ఇంకేముంది. ” మిల్లెట్ నూడిల్స్ ” ఈ న్యూడిల్స్ లో మైదా లేదు, రిఫైన్డ్ షుగర్ లేదు. నో యాడెడ్ కలర్, నో యాడెడ్ ఫ్లేవర్, పిల్లల ఆరోగ్యం గురించి ఒక అమ్మ ఎంతగా ఆలోచిస్తుంది. అలాంటిది ఈ న్యూడిల్స్ నీ ఇద్దరు అమ్మలు కలిసి పిల్లల గురించి ఆలోచించి చాలా ఆరోగ్యంగా తయారు చేశారు. దీనిలో కొలెస్ట్రాల్ కూడా లేవు.ఈ న్యూడిల్స్ ని తయారు చేసుకోవడం చాలా సులభం అండీ, తయారుచేసుకోవడం మీకోసం.

Advertisement

న్యూడిల్స్ చేసుకోడానికి కావలసిన పదార్థాలు,తయారీ విధానం మీకోసం,
కావలసిన పదార్థాలు: నూనె, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు,బీన్స్ ,క్యారెట్, టొమాటో, బఠానీ,మీకు నచ్చిన ఇంకేమైనా కూరగాయలు.

Advertisement

Millat Noodles : మైదా లేని న్యూడిల్స్ గురించి మీలో ఎంతమందికి తెలుసు?

slurrp form millat noodles making
slurrp form millat noodles making

తయారీ విధానం : ముందుగా ఒక గిన్నెలో నీరుపోసి దాంట్లో న్యూడిల్స్ వేసి ఉడికించాలి, పెద్దల కోసం చేసుకునేటట్టు అయితే న్యూడిల్స్ 75 పర్సంట్ కుక్ చేసుకోవాలి. పిల్లలకోసం అయితే 90 పర్సెంట్ కుక్ చెయ్యాలి. ఎందుకంటే. పిల్లలకి అరగడం కోసం కొంచెం ఎక్కువగా కుక్ చేసుకోవాలి, కుక్ చేసుకున్న న్యూడిల్స్ ని కొంచెం చల్లని నీటితో కూడా కడిగి, వడ కట్టడం వల్ల న్యూడిల్స్ అంటుకోకుండా ఉంటాయి. లేదా ఉడికించేటప్పుడు కొంచెం 2 డ్రాప్స్ ఆయిల్ వేసుకొని న్యూడిల్స్ ఉడికించుకుంటే ఒక దానితో ఒకటి అంటుకోకుండా ఉంటాయి ఇప్పుడు ఒక ఫ్యాన్ పెట్టుకొని దానిలో కొంచెం ఆయిల్ వేసుకొని, ఆయిల్ వేడి ఎక్కిన తర్వాత, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యారెట్, బీన్స్, టమాటో, మనం కట్ చేసుకొని పెట్టుకున్న కూరగాయలు అన్నీ నూనెలో వేసుకోవాలి. అవి అన్నీ వేగాక దాంట్లో న్యూడిల్స్ తో పాటు వచ్చే మసాలాను యాడ్ చేయాలి. తర్వాత ఉడికించుకున్న న్యూడిల్స్ ని వేసుకోవాలి. దీంట్లో మసాలా ప్యాకెట్ వస్తుంది కాబట్టి ఎక్స్ట్రా మనం వేరే ఏం వేసుకోకపోయినా పర్లేదు. ఆ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి, చివర్లో కొంచెం కొత్తిమీర వేసుకుని బాగా కలుపుకోవాలి, కొంచెం వేడి ఎక్కాక దించుకోవాలి. అంతే చాలా సింపుల్ చేసుకోవడం. ఈ మిల్లెట్ నూడిల్స్ చాలా ఆరోగ్యకరమైంది కాబట్టి అందరూ తినొచ్చు

Advertisement