నిజామాబాద్ ఆసుపత్రి ఘటనపై సూపరిండెంట్ స్పష్టత

నిజామాబాద్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో ఒక వ్యక్తిని లాగుతూ తీసుకెళ్లిన 11 సెకండ్ల వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. బీఆర్ఎస్ పాలనలో సర్కార్ ఆసుపత్రులలో వీల్ చైర్లు లేక రోగులను ఇలా ఈడ్చుకెళ్తున్నారని విపక్ష నేతలు బీఆర్ఎస్ ను కార్నర్ చేస్తూ విమర్శలు గుప్పించారు. దీంతో మంత్రి హరీష్ రావు విచారణకు ఆదేశించగా తాజాగా ఈఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. ప్రతిమరాజ్ క్లారిటీ ఇచ్చారు.

Advertisement

ఆసుపత్రిలో వీల్ చైర్లు లేవనే ప్రచారాన్ని ఖండించారు. అసలు ఆ వీడియో ఇప్పటిది కాదని స్పష్టం చేశారు. రోగిని ఆసుపత్రి సిబ్బంది ఈడ్చుకు వెళ్ళారని జరుగుతోన్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఆ వీడియోలో ఉన్న సదరు వ్యక్తిని అతని బందువులు అస్వస్థతగా ఉన్నాడని అత్యవసర విభాగానికి తీసుకుని వచ్చారన్నారు. అతను మద్యపానానికి బానిసగా ఉన్నాడని, సైకియాట్రిక్ విభాగానికి చెందిన ప్రత్యేక వైద్యులను సంప్రదించాలని రోగి బంధువులకు చెప్పినట్లు ప్రతిమరాజ్ వెల్లడించారు.

Advertisement

దాంతో ఆసుపత్రీ సిబ్బంది రోగిని వెయిటింగ్ హాల్ లో కూర్చోబెట్టి ఏదైనా సమస్య ఉంటె వైద్యులను సంప్రదించాలని అక్కడి నుంచి వెళ్ళినట్లు చెప్పారు. ఆ తరువాత ఆ రోగిని అతడి బంధువులు లాగుతూ తీసుకెళ్ళారని…. ఇంతలోనే ఓ వ్యక్తి దానిని వీడియో తీశాడని ఎందుకు వీడియో తీస్తున్నావని ప్రశ్నించగానే అతను అక్కడి నుంచి వెళ్ళినట్లు చెప్పారు.ఇందులో ఎక్కడ కూడా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం లేదని ఆసుపత్రి సూపరింటెండెంట్ స్పష్టత ఇచ్చారు.అసుపత్రిపై,సిబ్బంది పై దుష్ప్రచారం చేయడాన్నితీవ్రంగా ఖండిస్తున్నామని తెలయజేశారు.

ఈ సంఘటన జరిగి 15రోజులు అవుతుందని.. ఇప్పుడు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారని చెప్పుకొచ్చారు. అసలు విషయం తెలుసుకోకుండా వార్తలు ప్రసారం చేయడం సరైంది కాదని ( పాలిట్రిక్స్ ) కాదు. కొన్ని వార్తా చానెల్స్,వెబ్ సైట్లను హెచ్చరించారు.భాద్యతయుతంగా వ్యవహరించాలని పేర్కొన్నారు. ఇలాంటి వీడియోలు తీసి ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజలకు నమ్మకం పోగొట్టేలా చేస్తాయన్నారు. ఆసుపత్రిలో వీల్ చైర్ లు లేవనడం అబద్దమని 51 వీల్చైర్స్ఉన్నాయని స్పష్టం చేశారు.

Advertisement