Elon Musk : టెస్లా కార్ల తయారీ కంపెనీ ఇక ఇండియా రానట్లేనా…..

Elon Musk : ఈలోన్ మస్క్ ప్రపంచంలోనే అత్యంత దనవంతుడు. ఇతను అమెరికాలో పెద్ద వ్యాపారవేత్త ఇతను 12వ ఏటనే బ్లాస్టర్ అనే వీడియో గేమ్ ను తయారు చేసి విజయం సాదించారు. ఇతనికి చిన్నతనం నుండే బిజినెస్ మీద ఆసక్తి ఎక్కువ ఉండేది. అయినప్పటికీ చదువుమీద దృష్టి పెట్టి వార్టన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ నుండి ఎకనామిక్స్ లో పట్టపొందాడు. ఇతను 2002 లో స్పేస్ ఎక్స్ ను స్థాపించి విజయం పొందాడు. ఇది ఒక రాకెట్ తయారీ సంస్థ. 2003లో టెస్లా కార్ల తయారీ సంస్థను స్థాపించాడు. ఎన్ని కష్టాలు వచ్చిన టెస్లా కంపెనీని లాభాల బాటలో తీసుకువచ్చి ఇప్పుడు ప్రపంచంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా టెస్లా కార్ల తయారీ కంపెనీ గా తయారు చేశాడు. ఇప్పుడు కొత్తగా ట్విట్టర్ ను టేకోవర్ చేసుకోడానికి పావులు కదుపుతున్నారు.

Advertisement

టెస్లా అమెరికలో ఒక ఎలక్రిక్ కార్ల తయారీ సంస్థ. 2003లో ఈ కంపెనీని స్థాపించారు. ఈలొన్ మస్క్ టెస్లా కంపెనీ సి ఈ ఓ ఇప్పుడు ఈ కంపెనీ యొక్క మార్కెట్ ను ప్రపంచం అంత విస్తరించాలి అనే ఆలోచనలో ఉన్నాడు. అందులో భాగంగా గా అమెరికా చైనా లో మనిఫ్యాక్టర్ ఫ్యాక్టరీలను నెలకొల్పి భారీ ఎత్తున ఎలక్ట్రిక్ కార్లు తయారు చేస్తున్నారు. ఇపుడు ఇతను ఇండియా లో కూడా టెస్లా కార్లను తయారు చేయడానికి ఆసక్తి చూపుతున్నట్లు అందరూ అనుకున్నారు.

Advertisement
Tesla car maker is no longer coming to India
Tesla car maker is no longer coming to India

ప్రపంచంలో అతిపెద్ద మార్కెట్ అయినటువంటి భారత్ మార్కెట్లోకి రావడానికి ఈలోన్ మస్క్ ప్రతిపాదనలు పంపటం జరిగింది. అయితే అయితే ఈ టెస్లా కంపెనీ కార్లను భారత్ దిగుమతి చేసి అమ్మితే ఇండియన్ గవ్నమెంట్ చాలా వరకు పన్ను రూపం లో కట్టాల్సి వస్తుంది. కావునా ఈలోన్ మస్క్ తన ఎలెక్ట్రిక్ కార్లు కాలుష్య రహితంగా ఉంటాయి అని తనకు పన్ను మినహాయింపు ఇవ్వాలని కోరారు. అయితే భారత ప్రభుత్వం అందుకు పన్ను మినహాయింపు ఇవ్వాలంటే గిగా ఫ్యాక్టరీ ఇండియా లో పెడితే పన్ను గురించి ఆలోచిస్తాం అని తేల్చిచెప్పింది. దానికి బదులుగా తనకు ముందుగా కార్లు అమ్మటానికి అనుమతిస్తే ఫ్యాక్టరీ గురించి ఆలోచిస్తాం అని బదులు ఇవ్వటం జరిగింది. కానీ దీనికి భారత ప్రభుత్వం సమాధానం ఇవ్వక పోవటం తో ఇంకా ఒక కొలిక్కి రాలేదు.

భారత్ లో ఉన్న టెస్లా కారుకు అభిమాని అయినటువంటి తన ట్విట్టర్ కథా ద్వారా మధు సుధన్ టెస్లా కార్ల తయారీని ఎప్పుడు ఇండియా లో స్టార్ట్ చేస్తున్నారు అని ఈలోన్ మస్క్ అడిగాడు. దానికి ఈలోన్ మస్క్ సమాధానం గా మేము ఇండియా లో టెస్లా కార్ల తయారీ నీ ఇండియాలో పెట్టం అని క్లియర్ గా చెప్పాడు. ఇండియా మాకు పన్నులు రాయితీ ఇవ్వని కారణంగా మేము ఇండియా లో టెస్లా కార్లను తయారు చేసే ఉద్దేశం లేదు అని కుండ బద్దలు కొట్టేశాడు.

Advertisement