Viral News : కొడుకు కావాలన్న కోరికతో ఓ వ్యక్తి ఎ తండ్రి చేయని పనిని చేశాడు. సభ్య సమాజం తలవంచుకునేలా చేసాడు. ఓ తాంత్రికుడు చెప్పిన మాటలు విని తన కుమార్తె ల పైన గత కొన్ని సంవత్సరాలుగా అత్యాచారానికి పాల్పడుతూ వస్తున్నాడు. ఇక ఈ కేసులో ఆ నీచపు తండ్రికి తాజాగా కోర్టు జీవిత ఖైదు విధించింది. పూర్తి వివరాల్లోకెళ్తే…పాట్నాలోని బక్సర్ కి చెందిన ఓ దంపతులు చాలా కాలం నుంచి కొడుకు కోసం ఎదురుచూస్తున్నారు. అయితే వారికి ఇప్పటికే ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అయితే వారికి కొడుకు పుట్టాలంటే ఓ తాంత్రికుడుని కలవమని వారి బంధువులలో ఒకరు చెప్పారట. దీంతో ఆ వ్యక్తి అజయ్ కుమార్ అనే తాంత్రికుడు వద్దకు వెళ్లాడు.
తాంత్రికూడిని కలిసి విషయం చెప్పగా తన ఇద్దరి కూతుళ్ళ వాలనే కొడుకు పుట్టడం లేదని తాంత్రికూడు చెప్పాడు. అంతేకాక కొడుకు పుట్టాలంటే తన కూతుర్లతో లైంగిక సంబంధం పెట్టుకోవాలని చెప్పాడు.తాంత్రికుడు చెప్పిన మాటలు విన్న తండ్రి అప్పటినుండి కూతుర్లపై హత్యాచారం చేయడం మొదలుపెట్టాడు. ఇక దానికి వారి తల్లి ,తల్లి సోదరి కూడా సహకరించారు. కేవలం తండ్రి మాత్రమే కాకుండా అప్పుడప్పుడు తాంత్రికుడు కూడా వారిపై అత్యాచారానికి పాల్పడేవాడట. అయితే వారిపై దాదాపు 2012 నుంచి అత్యాచారం జరుగుతుందట. ఇక తండ్రి వేధింపులను భరించలేని ఆ ఇద్దరు అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇక పోలీస్ కేసు నమోదు చేసినప్పుడు బాధితురాళ్ల వయసు 14, 16 సంవత్సరాలు మాత్రమే. ఇలాంటి చర్యల ద్వారా సమాజం తలదించుకోవాల్సి వస్తుందని భావించిన కోర్టు ఇటీవల నిందితులకు కఠిన శిక్ష విధించింది. తండ్రికి మరియు తాంత్రికుడు అజయ్ కుమార్ కి జీవిత ఖైదు విధించింది. అలాగే వారి తల్లి మరియు ఆమె సోదరికి 20 సంవత్సరాల పాటు జైలు శిక్ష విధించారు. ఐపీసీ సెక్షన్ 376 ,34 ఫోక్సు చట్టంలోని సెక్షన్ 4 కింద నిందితులను దోషులుగా కోర్టు ప్రకటించింది. అయితే ఇక్కడ మరొక విషయం ఏమిటంటే యాదృచ్ఛికంగా వీరిద్దరికి ఒక కొడుకు కూడా పుట్టాడు.