Srihari : ఆ ఇంజక్షన్ ఇచ్చి శ్రీహరిని చంపేశారు .. షాకింగ్ నిజాలు బయటపెట్టిన భార్య..

Srihari : రియల్ స్టార్ శ్రీహరి గురించి మనందరికీ తెలిసిందే. ఆయన ముంబైలో గుండెపోటుతో చనిపోయినట్లు చెప్పుకొచ్చారు. ఏదో సినిమా పని మీద వెళ్లిన ఆయన అక్కడే గుండెపోటుతో మరణించారు. అయితే ఆయన మరణం ఇప్పటికే హిస్టరీ గానే మిగిలిపోయింది. అయితే ఆయన మరణం పై ఆయన భార్య డిస్కో శాంతి ఆసక్తికర కామెంట్లు చేశారు. ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె శ్రీహరి ఆ ఇంజక్షన్ వల్లే చనిపోయారని సెన్సేషనల్ కామెంట్స్ చేశారు.

Advertisement

హీరో శ్రీహరి మొదటిగా కమెడియన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, హీరోగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. పలు సినిమాలలో హీరోగా చేసిన ఆయన సెకండ్ ఇన్నింగ్స్ లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మారారు. కెరియర్ పీక్ స్టేజ్ లో ఉండగా ఆయన హఠాత్తుగా మరణించారు. ఏదో సినిమా పనిమీద ముంబై వెళ్ళిన ఆయన గుండెపోటుతో మరణించినట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. అయితే ఆయన భార్య డిస్కో శాంతి శ్రీహరి మరణించింది గుండెపోటుతో కాదని, ఆ ఇంజక్షన్ వల్లే అంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తన కళ్ళముందే శ్రీహరి చనిపోయాడని ఆవేదన వ్యక్తం చేసింది. దీనంతటికీ కారణం ఆ ముంబైలోని డాక్టర్స్ అని బోరున విలపించింది.

Advertisement

ఆమె మాట్లాడుతూ శ్రీహరి చనిపోయే ముందు రోజు సాయంత్రం కల్లా వస్తానని చెప్పారట. గుండెపోటు వచ్చిందని చెప్పడంతో ఆయనను హాస్పటల్ కి పంపించాక నేను వెళ్ళాను. ఆయన కళ్ళు మూసుకుని ఉన్నారు. మళ్లీ మళ్లీ వెళ్లి చూస్తే చెవుల నుంచి ముక్కులో నుంచి రక్తం కారుతుంది. అక్కడే ఉన్న డ్యూటీ డాక్టర్ ఆయనకు సెలైన్ లో ఇంజక్షన్ కలిపారు. ఇంజక్షన్ తర్వాతే ఆయనకు బ్లడ్ రావడం జరిగింది. నన్ను బయటికి పంపించేశారు. తర్వాత నేను వెళ్లి చూడగా అంతా తూడిచేచేశారు. కానీ కింద మొత్తం బ్లడ్ ఉంది. నేను మొత్తం చూశాను. ఆయనకు రాంగ్ ఇంజక్షన్ చేశారు. నాకు హిందీ రాదు. ఆ డాక్టర్స్ కి ఆయన ఎవరో తెలియదు. అదే ఇక్కడ అయితే శ్రీహరి బ్రతికేవారు. ఆయన చనిపోయాక ఏం చేయాలో తెలియక ముంబైలో చిక్కిపోయాం. మా కుటుంబ సభ్యుల సహాయంతో ఇంటికి తీసుకువచ్చాం. చిరంజీవి ఠాగూర్ సినిమాలో చనిపోయాక డబ్బులు కట్టించుకుంటారు గా అలాగే శ్రీహరి విషయంలో కూడా అలాగే జరిగింది అంటూ చెప్పుకొచ్చారు.

Advertisement