Sanatana Dharma Remarks : సనాతన ధర్మం సామాజిక న్యాయానికి వ్యతిరేకమని దానిని పూర్తిగా నిర్మూలించాలని తమిళనాడు ముఖ్యమంత్రి ఎమ్ కే స్టాలిన్ కుమారుడు మంత్రి సినీ హీరో ఉదయ్ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపుతున్నాయి. దీంతో ఉదయనిది స్టాలిన్ కు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా బిజెపి ఆందోళనలు చేస్తుంది. అంతేకాక పలుచోట్ల ఉదయ్ నిది స్టాలిన్ పై కేసులు కూడా నమోదు చేశారు. తెలుగు రాష్ట్రాలలో హిందూ వాదులు సైతం ఉదయనిది స్టాలిన్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ట్విట్టర్ లో షేర్ చేసిన పాత ట్విట్ ఒకటి వైరల్ అవుతుంది. సనాతన ధర్మాన్ని ఉద్దేశించి 2020లో రామ్ చరణ్ ఓ ట్విట్ చేశారు.
తన తల్లి సురేఖ కొణిదల ఇంట్లో తులసి మొక్కకు పూజ చేస్తున్న ఫోటోను షేర్ చేసిన రామ్ చరణ్ మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి బాధ్యత అని పేర్కొన్నారు. అయితే 2020 సెప్టెంబర్ 11న చేసిన ఈ ట్విట్ ఇప్పుడు మరలా వైరల్ అవుతుంది. దీనికి గల కారణం ఉదయ్ నిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలని చెప్పాలి. సినిమాలను ఇష్టపడే కొంతమంది హిందూ వాదులు అప్పుడు రామ్ చరణ్ చేసిన ట్వీట్ ను రిట్విట్ చేస్తున్నారు. తమిళనాడు ప్రోగ్రెసివ్ రైట్ అండ్ ఆర్టిస్టు అసోసియేషన్ శనివారం సనాతన ధర్మం నిర్మూలన అనే అంశంపై సదస్సు నిర్వహించగా దీనికి ముఖ్య అతిథిగా ఉదయ్ నిది స్టాలిన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాజిక న్యాయం సమానత్వానికి సనాతన ధర్మం వ్యతిరేకంగా ఉంటుందని అన్నారు.
కొన్నింటిని మనం కేవలం వ్యతిరేకించి ఊరుకోకూడదు వాటిని మనం నిర్మూలించాలి, దోమలు , డెంగ్యూ , మలేరియా వంటి వాటిని వ్యతిరేకిస్తే సరిపోదు నిర్మూలించాలి. అలాగే మనం సనాతన ధర్మాన్ని కూడా నిర్మూలించాలని ఉదయ్ నిది స్టాలిన్ పేర్కొన్నారు. దీంతో ఈ వ్యాఖ్యలపై బీజేపీ నాయకులు మండిపడ్డారు. కేసులు పెడదామంటూ హెచ్చరించారు. అయినప్పటిక ఉదయ్ నిధి స్టాలిన్ వెనుకడుగు వేయడం లేదు. తాను చేసిన వ్యాఖ్యలకు ఎప్పటికీ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు. తాజాగా మీడియాతో ముచ్చటించిన ఉదయ్ నిది నాపై ఎలాంటి కేసులు పెట్టిన ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నానని తెలియజేశారు. ప్రజలను తప్పుదోవ పట్టించడానికి బిజెపి నాయకులు దీనిని ఇంత రాదాంతం చేస్తున్నారని పేర్కొన్నారు.
మన సనాతన ధర్మాన్ని రక్షించుకోవడం మనందరి భాధ్యత…. #Bharathiya_Culture_Matters pic.twitter.com/Mi5Bl3k8nY
— Ram Charan (@AlwaysRamCharan) September 11, 2020