skin care : మీ బాడీకి, ఫేస్ కి ఒకటే సబ్బు వాడుతున్నారా… అయితే అది ఎంత డేంజరో తెలుసా..?

skin care : ప్రతి ఒక్కరూ అందంగా ఉండాలని కోరుకుంటారు. ముఖంపై మచ్చలు ,మొటిమలు లేకుండా మెరుస్తూ ఉండాలని ఎన్నో విధాలుగా ప్రయత్నిస్తుంటారు. అయితే బయటకు వెళ్ళినప్పుడు కాలుష్యం కారణంగా చాలామంది అనేక రకాలైన చర్మ సమస్యలతో సతమతమవుతున్నారు. రోజు చర్మం పొడిబారడం , జిడ్డుగా ఉండడంతో ఎంతో బాధపడుతుంటారు.ఇటువంటిసమస్యనుండిబయటపడేందుకు వివిధ రకాల సోప్స్ ,క్రీములు వాడుతుంటారు. కానీ ఫలితం మాత్రం ఉండదు. అందం పెరగాలంటే ఎటువంటి సబ్బులు వాడడం మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

చాలామంది అందం పెంచుకోవడం కోసం వివిధ రకాల సబ్బులను వాడుతుంటారు. అయితే శరీరానికి అవసరమయ్యే సబ్బు.. ముఖానికి సరిపోదట. ఈ రెండింటి అవసరాలు వేరువేరుగా ఉంటాయట. మనం ముఖానికి సబ్బు వాడకూడదట. ముఖంపై సబ్బును వాడడం వల్ల పలు రకాల సమస్యలు ఎదురవుతాయని నిపుణులు తెలియజేశారు. ఆన్లైన్లో, మార్కెట్లలో ఎన్నో రకాల స్కిన్ కేర్ బ్రాండ్లు అందుబాటులో ఉంటున్నాయి.

Advertisement

 skin care : మీ బాడీకి, ఫేస్ కి ఒకటే సబ్బు వాడుతున్నారా…

using soap on the face heres why you need to stop immediately
using soap on the face heres why you need to stop immediately

వీటిల్లో చాలావరకు పేస్ కోసం తయారుచేసిన సోపులు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి సబ్బుల్లో హైపోఆలేర్ఫెనిక్, సువాసన లేని, చర్మాని తేమగా ఉంచే వాటిని మాత్రమే ముఖం కోసం ఉపయోగించాలి. ఫేస్ కి వాడే సబ్బులు సైరామైడులు, నియాసినామైడులు , గ్లిజరిన్ ఉండేలా చూసుకోవాలి. ఇవన్నీ మనము ముఖ చర్మాన్ని కాపాడడానికి ఉపయోగపడతాయి. ముఖ చర్మంపై నేరుగా సబ్బును పెట్టి రుద్దకూడదు దీనివల్ల ముఖంపై గీతలు ఏర్పడతాయి. ముఖ చర్మం కఠినంగా మారుతుంది. కృత్రిమ రంగులను సబ్బులు తయారీలో అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇవి మీ సున్నితమైన చర్మాన్ని పాడుచేస్తాయి. వీటి వల్ల మొటిమలు, మచ్చలు ఏర్పడతాయి.

కొన్ని సబ్బుల్లో పీహెచ్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి చర్మంపై పేరుకుపోయి ఉన్నా మురికిని తొలగింపబడతాయి. వీటిని ఫేస్ కి అప్లై చేయడం వల్ల ముఖ చర్మానికి హాని కలుగుతుంది. మన స్కిన్ ను బట్టి సబ్బు ఏంపిక చేసుకోవాల్సి ఉంటుంది. స్కిన్ కేర్ లో టోనింగ్ , క్లీనింగ్, మాయిశ్చరైజింగ్ ఉంటాయి. మీ చర్మాన్ని బట్టి వివిధ రకాల క్లే న్సింగ్ ఉంటాయి. జిడ్డు చర్మం ఉన్నవారు కొనుగోలు చేసే క్లీనర్ విషయంలో జాగ్రత్త తీసుకోవాలి. జిడ్డుని తొలగించి, పింపుల్స్ ను తొలగించే సోప్ ఎంచుకోవాలి.

Advertisement