Vijay Deverakonda : ఖుషి సినిమా విజయంతో చాలా ఖుషి గా ఉన్న విజయ్ దేవరకొండ ఇటీవల యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్నారు. విజయ్ దేవరకొండ తల్లిదండ్రులు గోవర్ధన్ రావు, మాధవి తమ్ముడు ,ఆనంద్ దేవరకొండ మరియు ఖుషి సినిమా నిర్మాతలు వై.రవిశంకర్ , నవీన్ ఎర్నేని, దర్శకుడు శివా , నిర్వాణ , తదితరులు కలిసి ఆదివారం ఉదయం యాదాద్రి పుణ్యక్షేత్రంలో పూజలు చేశారు.ఆలయ అధికారులు వీరిని స్వాగతించి వారికి స్వామి వారి దర్శనం కల్పించి ప్రత్యేకంగా అర్చనలు నిర్వహించారు. అయితే నేటి యువతలో విజయ్ దేవరకొండకు ఎంతటి ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఇక విజయ్ బయట కనిపించాడంటే అభిమానులు ఎంతగా ఎగబడతారో తెలిసిందే. దీంతో యాదాద్రి ఆలయంలో భారీ బందోబస్తు నడుమ విజయ్ దేవరకొండ కుటుంబం మరియు ఖుషి సినిమా చిత్ర బృందం ఆలయంలోకి వెళ్లారు. అయినప్పటికీ అనుకోని ఓ సంఘటన అక్కడ చోటు చేసుకుంది. దర్శనానంతరం విజయ్ దేవరకొండ తన కుటుంబ సభ్యులతో కలిసి నడుస్తూ వస్తుండగా భద్రత వలయాన్ని దాటుకుని మరి ఒక అమ్మాయి విజయ్ దగ్గరకు వచ్చింది. ఒక్కసారిగా వచ్చి విజయ్ ను గట్టిగా పట్టుకుంది. వెంటనే అప్రమత్తమైన భద్రత సిబ్బంది ఆ అమ్మాయిని అడ్డుకునే ప్రయత్నం చేశారు.
ఇంతలో విజయ్ ఆగమని చెప్పి అమ్మాయి తో ఫోటో దిగి పంపించారు. అభిమాన హీరోని ముట్టుకోవడమే కాక ఫోటో దిగడంతో ఆ అభిమాని అమ్మాయి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. అయితే విజయ్ దేవరకొండను అమ్మాయి అలా పట్టుకున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో దుమారం లేపుతుంది. ఇదిలా ఉంటే ఖుషి సినిమా ప్రపంచవ్యాప్తంగా విడుదలై రెండు రోజుల్లోనే రూ.51 కోట్లకు పైగా గ్రాస్ ను వసూలు చేసింది. ఇక ఈ విషయాన్ని సినిమా నిర్మాణ సంస్థ మైత్రి మూవీ మేకర్స్ ప్రకటించారు. దీనికి సంబంధించి ఒక పోస్టర్ ను కూడా విడుదల చేసింది.
అమ్మాయిలు మీరు కూడ ఇలా వచ్చేస్తే ఎలా 🤦♂️#BlockbusterKushi 🩷 pic.twitter.com/oHPb9uhQLf
— Sreenivas Gandla (@SreenivasPRO) September 3, 2023