Viral Video : ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ప్రతీది క్షణాల్లో వైరల్ అవుతుంది. అందులో కొన్ని వీడియోలు మనల్ని ఆలోచింపజేసేలా ఉంటే మరికొన్ని వీడియోలు సరదాగా ఉంటాయి. అలాగే మరికొన్ని వీడియోలు చూడగానే ఆగ్రహం తెప్పించేలా ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలో చూడగానే నెటిజన్లకు తీవ్ర ఆగ్రహం కలిగించింది. ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఓ స్కూటీపై ముగ్గురు యువకులు వెళ్తున్నట్లు చూడవచ్చు.
వాళ్ళు ఏమైనా పందెం కాసుకున్నారో లేదో మరే విషయమో తెలియదు కానీ ఒక్కసారి వెనక కూర్చున్న ఇద్దరు యువకులు ఘాటైన లిప్ కిస్ ఇచ్చుకున్నారు. ఈ తతంగం మొత్తం వారి వెనక ఫాలో అవుతున్న వ్యక్తులు వీడియో తీసి దానిని సోషల్ మీడియాలో పెట్టారు. అది కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇప్పటివరకు ఈ వీడియోను 1,50,000 మందికి పైగా చేశారు. ఈ వీడియోని చూసిన నెటిజెన్లు వివిధ రకాలుగా కామెంట్ చేస్తున్నారు. అలాగే ఆ యువకులను పచ్చి బూతులు తిడుతున్నారు.

ఇదేం పైత్యం సామీ అని కొందరు తల పట్టుకోగా, మరికొందరు పబ్లిక్ గా ఇలాంటి పనులు ఏంటి, లైక్స్ కోసం ఇలాంటి చెత్త వీడియోలు చేస్తారా అని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్ అవడంతో ట్రాఫిక్ లో ఇలాంటి అసభ్యకరమైన పనులు చేసిన యువకులను పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. అసలు రోజు రోజుకి సమాజం ఎటు పోతుందో అర్థం కావడం లేదు. జనాల వికృత చేష్టలు పక్కవారిని కూడా ఇబ్బంది కలిగించేలా ఉన్నాయి. సోషల్ మీడియా తప్పా లేక జనాలు ఆలోచించే విధానం తప్పా అర్దం కావడం లేదు.
रामपुर में चलती स्कूटी पर लिप लॉक करते हुए युवा
तीनों की तलाश जारी है….. pic.twitter.com/4MVRFQ2U6g— Kavish Aziz (@azizkavish) May 31, 2023