Devotional : హిందువులు తమలపాకులను శుభసూచికంగా భావిస్తారు. భగవంతుని పూజలో, అతిధుల మర్యాదలోల్లు, దక్షిణ ఇచ్చేటప్పుడు, తాంబూలాన్ని ఇచ్చేటప్పుడు తమలపాకులను ఉపయోగిస్తారు. వధువు ,వరుడులు తాంబూలం సేవనం చేయడం వల్ల వారి అనురాగ రెట్టింపు అవుతుందని మన పెద్దలు చెబుతుంటారు. మన హిందూ సాంప్రదాయంలో తమలపాకులు లేకుండా ఎటువంటి శుభకారం పూర్తవ్వదు. పెళ్లిళ్లలో తమలపాకులను ఎక్కువగా ఉపయోగిస్తారు. వధువు మండపంలో అడుగు పెట్టడానికంటే ముందు చేతిలో తమలపాకుతో ఉన్న తాంబూలం పెడతారు. జిలకర్ర ,బెల్లాన్ని తమలపాకుతో కలిపి పెడతారు.
తమలపాకు కు అంత ప్రాధాన్యత ఎందుకు ఇస్తున్నారు… దానిని దాని గురించి శాస్త్రం ఏం చెప్తుందో తెలుసుకుందాం. మన తెలుగు వారు తమలపాకులను అష్టమంగళాల లో పూలు ,అక్షింతలు, ఫలాలు ,దళం, వస్త్రం, తమలపాకు మరియు వక్క ,దీపం ,కుంకుమ తో ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో తమలపాకులను ఉపయోగిస్తారు. అంతేకాకుండా వ్రతాలలో, నోముల్లో ,తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు. పసుపు గణపతిని ,గౌరీదేవిని తమలపాకులు పైనే అధిష్టింపజేస్తాం. క్షీర సాగర మధునం గురించి కూడా వినే ఉంటారు. స్కంద పురాణం ప్రకారం శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్టుని హిమాలయాలు లోనాటుతారని నమ్ముతారట.
Devotional : హిందూ వివాహాలలో తమలపాకు కు ఎందుకు అంత ప్రాధాన్యత ఇస్తారు.

తమలపాకు కు మొదటి భాగంలో కీర్తి ,చివరి భాగంలో ఆయువు ,మధ్య భాగంలో లక్ష్మీదేవి ఉంటారట. అందుకే తమలపాకు కు ఇంత ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు. పెళ్లిలో జీలకర్ర బెల్లం పెడితే దాదాపు పెళ్లి అయిపోయినట్టే. ఇటువంటి జీలకర్ర బెల్లాన్ని తమలపాకులో ముంచే పెడతారు. బెంగాలీ వివాహాలలో వధువుని ఆమె సోదరులు తీసుకొస్తుండగా… ఆమె తన ముఖాన్ని రెండు తమలపాకులతో కనిపించకుండా కవర్ చేస్తుంది. వరుడు ముందు కూర్చుని వాటిని తొలగించి పెళ్ళికొడుకుని చూస్తుందట. ఇలా చేస్తే అదృష్టం కలుగుతుందని వారి నమ్మకం.