Jerry in Idli : హోటల్ నుంచి తెచ్చుకున్న ఇడ్లీలో పెద్ద జెర్రీ.. అవి తిన్న మహిళకు ఏమైందో తెలుసా? ఎక్కడ జరిగిందంటే?

Jerry in Idli : హోటల్ ఫుడ్ ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఎప్పుడో ఇంట్లో వండుకోవడం కుదరనప్పుడు, బయటికెళ్లినప్పుడు, అత్యవసర సమయాల్లో మాత్రమే బయట ఫుడ్ తినాలి కానీ.. ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కడ పడితే అక్కడ హోటల్ ఫుడ్ తింటే కోరి మరీ అనారోగ్యాన్ని తెచ్చుకున్నట్టే అవుతుంది. హోటల్ లో తినే ఫుడ్ లో చాలాసార్లు బొద్దింకలు, ఈగలు, బల్లులు రావడం చూసే ఉంటారు కానీ.. ఎప్పుడైనా ఫుడ్ లో జెర్రి రావడం చూశారా.

Advertisement
woman found jerry in idli parcel in telangana
woman found jerry in idli parcel in telangana

అసలు చాలామందికి జెర్రీని చూస్తేనే భయమేస్తుంది. అటువంటి జెర్రీ ఏకంగా ఇడ్లీలో కనిపిస్తే ఇంకేమైనా ఉందా? ఆ జెర్రీని చూసి ఇడ్లీని తినే మహిళ ఇంకెంత షాక్ అయి ఉండాలి. ఈ షాకింగ్ ఘటన తెలంగాణలోని పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో చోటు చేసుకుంది.

Advertisement

Jerry in Idli : హోటల్ ను సీజ్ చేసిన అధికారులు

సుల్తానాబాద్ లో బస్టాండ్ ఎదురుగా ఉన్న ఓ హోటల్ లో కూరగాయలు అమ్మే ఓ మహిళ ఇడ్లీని తీసుకుంది. పార్శిల్ చేయించుకొని.. కురగాయలు అమ్మే వద్ద కూర్చొని దాన్ని ఓపెన్ చేసి రెండు ఇడ్లీలు తిన్నది. మూడో ఇడ్లీ తినే సమయంలో ఆ ఇడ్లీలో పెద్ద జెర్రి కనిపించింది. ఆ జెర్రిని చూసి ఆ మహిళ షాక్ అయింది. అప్పటికే మూడో ఇడ్లీ సగం తినేసింది. దీంతో తను అస్వస్థతకు గురయి వాంతులు చేసుకుంది.

వెంటనే అక్కడున్నవాళ్లకు జెర్రిని చూపించడంతో అక్కడి వాళ్లు దాన్ని ఫోటోలు, వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఆ ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ ఘటన గురించి సమాచారం అందుకున్న మున్సిపల్ అధికారులు హోటల్ కు వెళ్లి వెంటనే సీజ్ చేశారు. మిగితా హోటల్స్ లో అధికారులు తనిఖీలు నిర్వహించి.. ఫుడ్ సరిగ్గా లేని హోటల్స్ కు జరిమానా విధించారు.

Advertisement