ఏపీ సీఎంవోలో ఇద్దరు మహిళా జర్నలిస్టులు కొట్టుకొని దూషించుకున్నారు. నీ బాగోతం నాకు తెలియదా..? అంటూ పరువు తీసుకున్నారు. ఒకరిపై ఒకరు దాడి చేసుకున్న జర్నలిస్టులు ఎవరో కాదు. ఒకరు టీవీ9 రిపోర్టర్ హసీనా మరొకరు ఎన్టీవీ రిపోర్టర్ రెహానా.
ఏపీలో ఏదైనా ఇష్యూ జరిగితే ఈ ఇద్దరు జర్నలిస్టులు వెంటనే సీఎంవోలో ప్రత్యక్షం అవుతారు. సజ్జల ముంగిట కనిపిస్తారు. మా మైక్ ముందుండాలంటే మా మైక్ ముందుండాలని గోలగోల చేస్తుంటారు. వీళ్ళ పంచాయితీ చూసి సహచర జర్నలిస్టులు సైతం నవ్వుకున్న పరిస్థితులు ఉన్నాయి. అవన్నీ తమకు తెలియదు… సజ్జల దృష్టిలో పడటం ఒక్కటే తమ టార్గెట్ అనేలా వీరి వ్యవహారశైలి కనిపిస్తుంటుంది.
ఈ ఇద్దరు ఇలా కొట్టుకొని ఊరుకుంటే గాసిప్ గానే ఉండిపోయేది. కానీ ఇందుకు సంబంధించిన వీడియోలను వారే సోషల్ మీడియాలో పోస్ట్ చేసుకుకొని విషయం అందరికీ తెలిసేలా చేసుకున్నారు. ఇంకేముంది వీరి నిర్వాకం చానెల్స్ యాజమాన్యానికి చేరింది. వారిని అక్కడి నుంచి బదిలీ చేశాయి. రెహానాను వైజాగ్‌కు, హసీనాను హైదరాబాద్‌కు ఆయా ఛానల్స్ బదిలీ చేశాయి.
ప్రస్తుతానికి ఈ ఇద్దరినీ బదిలీ చేశారు కానీ త్వరలోనే వారు మళ్ళీ సీఎంవోలో ఎంట్రీ ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. వారికున్న సంబంధాలు అలాంటివి మరి.