Hyderabadi Biryani : హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్. ఈ విషయం అందరికీ తెలుసు. హైదరాబాద్ అనగానే చాలామందికి టక్కున గుర్తొచ్చే పేరు బిర్యానీ. కానీ.. హైదరాబాద్ బిర్యానీ పేరుతో మోసాలు చేస్తున్నారు. లక్షలు గడిస్తున్నారు. పేరుకు హైదరాబాదీ బిర్యానీ. కానీ.. రుచి చూస్తే మాత్రం హైదరాబాద్ బిర్యానీలా ఉండదు. హైదరాబాద్ లో ఉన్న అన్ని హోటల్స్ లో బిర్యానీ సూపర్ గా ఉండదు. కొన్ని హోటల్స్ లోనే అసలైన హైదరాబాదీ బిర్యానీ లభిస్తుంది. కానీ.. కొన్ని హోటల్స్ మాత్రం హైదరాబాదీ బిర్యానీ పేరుతో మోసం చేస్తున్నాయి. నాణ్యతలేని బిర్యానీని హైదరాబాద్ బిర్యానీ అని చెప్పి వందలకు వందలు కస్టమర్ల నుంచి గుంజుతున్నాయి.

తాజాగా హైదరాబాద్ లోని నారాయణగూడలో ఉన్న ఓ ఫేమస్ హోటల్ లో బిర్యానీలో పురుగులు వెలుగుచూశాయి. ఏదో మామూలు హోటల్ లో నాణ్యత లేని బిర్యానీ అంటే ఏదో అనుకోవచ్చు కానీ.. ఫేమస్ హోటల్ లో బిర్యానీ లో పురుగులు వెలుగు చూడటంతో కస్టమర్ షాక్ అవడంతో పాటు ఈ విషయం తెలిసి స్థానికులు కూడా షాక్ అయ్యారు.
Hyderabadi Biryani : వెంటనే రంగంలోకి దిగిన మున్సిపల్ అధికారులు
ఓ వ్యక్తి హోటల్ కు వెళ్లాడు. బిర్యానీ ఆర్డర్ చేశాడు. బిర్యానీ తీసుకొచ్చి ఇచ్చారు రెస్టారెంట్ వాళ్లు. దీంతో తినడం స్టార్ట్ చేశాడు. ఒక రెండు ముద్దలు తిన్నాడో లేదో.. బిర్యానీ ఏదో తేడా కొట్టింది. దీంతో వెంటనే ఆ బిర్యానీని చెక్ చేశాడు. అందులో పురుగులు కనిపించాయి. దీంతో ఆ కస్టమర్ షాక్ అయ్యాడు. వెంటనే ఈ విషయాన్ని హోటల్ సిబ్బంది దృష్టికి తీసుకెళ్లాడు. వెంటనే వాళ్లు తమదే తప్పు అన్నట్టుగా మాట్లాడారు కానీ ఇంత నిర్లక్ష్యంగా హోటల్ వ్యవహరించడం ఏంటి.. కస్టమర్ల ఆరోగ్యంతో చెలగాటం ఆడటం ఏంటి అని వెంటనే జీహెచ్ఎంసీకి సదరు కస్టమర్ ఫిర్యాదు చేశాడు. అలాగే మున్సిపల్ అధికారులు, పోలీసులు కూడా హోటల్ లో తనిఖీలు నిర్వహించారు.