YS Jagan : అస్సలు తగ్గేదేలే.. అంటున్న వైఎస్ జగన్.. ప్రశాంత్ కిషోర్ అస్త్రం పనిచేస్తోందా? ఏపీలో ఏం జరుగుతోంది?

YS Jagan : అవును.. తగ్గేదేలే అని పుష్ప సినిమాలో హీరో అల్లు అర్జున్ చెబితే చప్పట్లు కొట్టాం. మనం కూడా సోషల్ మీడియాలో తగ్గేదేలే అంటూ వీడియోలు చేశాం. మరి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి తగ్గేదేలే అంటే మాత్రం ఎందుకు అంత ఆశ్చర్యం. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్ కూడా తగ్గేదేలే అంటూ దూసుకెళ్తున్నారు. యమ స్పీడ్ లో ఉన్నారు. అస్సలు ఎవ్వరికీ అందను అంటున్నాను. ఆయన స్పీడ్ చూసి ప్రతిపక్షాలకు వణుకు మొదలైందని ఏపీలో గుసగుసలాడుకుంటున్నారు.

Advertisement

ysrcp party is in dilemma for presidential elections

Advertisement

ఇంకో రెండేళ్లలో ఏపీలో ఎన్నికలు రాబోతున్నాయి. అంటే.. ఇంకో రెండేళ్లే సీఎంగా జగన్ ఉండేది. అంటే.. రెండేళ్ల తర్వాత జరిగే ఎన్నికల్లో మళ్లీ వైసీపీనే గెలిస్తే జగనే సీఎం అది వేరే విషయం అనుకోండి. కానీ.. ప్రస్తుతానికి రెండేళ్ల వరకు అయితే జగన్ కు డోకా లేదు. అయినప్పటికీ.. వచ్చే ఎన్నికల్లోనూ అధికారం చేజిక్కించుకోవడం కోసం సీఎం జగన్ ఇప్పటి నుంచే ప్రణాళికలు సిద్ధం చేశారు.

సర్వేలు స్టార్ట్ చేయించారు. మరోవైపు గడపగడపకూ మీ ప్రభుత్వం అంటూ ఓ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కార్యక్రమం పేరుతో ప్రతి ఎమ్మెల్యే.. తమ నియోజకవర్గంలోనే మరో 8 నెలల పాటు ఉండాలని.. ప్రజల సమస్యలు తెలుసుకోవాలని హుకుం జారీ చేశారు. అంతేనా… ఏ నేతకు అయితే ప్రజల బలం ఉందో.. ప్రజల మద్దతు ఉందో వాళ్లను తన పార్టీలోకి లాక్కోవడానికి జగన్ తెగ ప్రయత్నాలు చేస్తున్నారట.

YS Jagan : ఎంపీ టికెట్ కావాలా? లేక ఎమ్మెల్యే టికెట్ కావాలా?

పార్టీలోకి వచ్చే ప్రజాబలం ఉన్న నేతలకు ఎంపీ లేదంటే ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేందుకు జగన్ రెడీగా ఉన్నారట. ఇప్పటి నుంచే బలమైన నేతలను తన పార్టీలోకి లాక్కునేందుకు జగన్ ప్రయత్నాలు చేయడం వెనుక ఉన్నది ఎవరో కాదు.. ప్రశాంత్ కిషోర్ టీమే. అవును.. ఆ టీంతో పాటు ఇంటెలిజెన్స్ రిపోర్ట్ కూడా జగన్ వద్ద ఉందట. ఇంకా కొన్ని సర్వేల నివేదికల ఆధారంగా.. కొందరు నేతలను పార్టీలోకి లాక్కోవడానికి జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టినట్టు సమాచారం.

ఏ పార్టీలో ఉన్నా సరే.. కాస్త ప్రజాబలం ఉంటే చాలు.. వెంటే వాళ్లను పార్టీలోకి తీసుకోవాలని జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారట. దీంతో వైసీపీ ముఖ్య నేతలు ప్రస్తుతం అదే పనిలో పడ్డారు. రహస్య భేటీలు.. మంతనాలు అన్నీ గుట్టు చప్పుడు కాకుండా జరిగిపోతున్నాయి.

టీడీపీ అధినేత చంద్రబాబు ఒక అడుగు వేసేలోపే.. జగన్ మూడు అడుగులు ముందుకు వేయాలని ఆలోచిస్తున్నారు. టికెట్ ఇవ్వడం మాత్రమే కాదు.. ఆ అభ్యర్థికి ఎన్నికల్లో అయ్యే ఖర్చు కూడా భరించేందుకు వైసీపీ సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఓవైపు రాష్ట్రంలో పాలన చేస్తూనే.. ప్రతిపక్ష పార్టీలకు అందకుండా వ్యూహాలు రచిస్తూ.. వచ్చే ఎన్నికలకు జగన్ ఇప్పటి నుంచే సంసిద్ధం అవుతున్నారు.

Advertisement