Viveka Murder Case : అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డి అరెస్ట్

వైఎస్ వివేకా హత్యకేసులోకీలక పరిణామం చోటుచేసుకుంది. అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేసింది. ఆదివారం ఉదయం భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేస్తున్నట్లు నోటిసులు ఇచ్చి హైదరాబాద్ తీసుకెళ్ళారు. మరోవైపు అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఆయన పులివెందులలో లేరు.హైదరాబాద్ లో ఉన్నట్లు సమాచారం. ఆయన నివాసానికి కూడా సీబీఐ అధికారులు వెళ్ళినట్లు తెలుస్తోంది.

Advertisement

Advertisement

వివేకా కేసులో దర్యాప్తు అధికారి మారడంతో అవినాష్ రెడ్డి రిలాక్స్ అయ్యారు. ముప్పు తప్పిందని భావించారు. అందుకే హైకోర్టులో అవినాష్ రెడ్డి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్ ను కూడా క్యాన్సిల్ చేసుకున్నారు. ఈనేపథ్యంలోనే సీబీఐ అవినాష్ రెడ్డికి వరుస షాకులు ఇస్తోంది. మొన్ననే అవినాష్ రెడ్డి సన్నిహితుడు అయిన ఉదయ్ కుమార్ రెడ్డిని అరెస్ట్ చేసిన సీబీఐ తాజాగా అవినాష్ రెడ్డి తండ్రిని కూడా అరెస్ట్ చేసింది. దీంతో అవినాష్ రెడ్డిలో టెన్షన్ మొదలైంది.

ఉదయ్ కుమార్ రెడ్డి రిమాండ్ రిపోర్ట్ లో వివేకా హత్యా కేసు వివరాలను పేర్కొన్న సీబీఐ..ఈ కేసులో మరిన్ని అరెస్టులు ఉంటాయని శనివారం కోర్టుకు తెలిపింది. ఈ రిమాండ్ రిపోర్ట్ సమర్పించిన ఒక్క రోజు వ్యవధిలోనే భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేయడం సంచలనంగా మారింది.అవినాష్ రెడ్డి హస్తం కూడా ఉందని సీబీఐ పేర్కొంది.దీంతో రేపోమాపో అవినాష్ రెడ్డిని కూడా అరెస్ట్ చేసే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది.

Advertisement