లాడ్జ్ లో గర్ల్ ఫ్రెండ్ తో అడ్డంగా దొరికిన చక్రధర్ గౌడ్..?

రైతు బాంధవుడిగా, సంఘ సంస్కర్తగా కలరింగ్ ఇచ్చిన బీజేపీ నేత చక్రధర్ గౌడ్ అసలు రంగు మెల్లగా బయటపడుతోంది. ఆ మధ్య తన స్నేహితుడి భార్యపై అత్యాచారయత్నం చేసిన చక్రధర్ గౌడ్, తాజాగా ఓ యువతితో హైదరాబాద్ పంజాగుట్టలోని ఓ లాడ్జిలో సరసాలు ఆడుతూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. విషయం బయటకు రావడంతో చక్రధర్ గౌడ్ పై తీవ్ర విమర్శలు వెళ్ళువెత్తుతున్నాయి. సేవా కార్యక్రమాల ముసుగులో అమ్మాయిలను లోబరుచుకుంటున్నాడనే మండిపడుతున్నారు. మరోవైపు..ఈ విషయాన్ని బయటకు రాకుండా చేసేందుకు బీజేపీ నేతలు రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది.

Advertisement

గాద‌గోని చ‌క్ర‌ధర్ గౌడ్.. ఈ మ‌ధ్య కాలంలో సిద్ధిపేటలోనే కాకుండా పలు జిల్లాలోనూ వినిపిస్తోంది ఈ పేరు. సిద్ధిపేటలో నివాసమంటూ రియల్ ఎస్టేట్ బిజినెస్ తో ఆర్థికంగా బలంగా ఎదిగిన చక్రధర్ గౌడ్ ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ అనే సంస్థను ప్రారంభించి కౌలు రైతులకు ఆర్ధిక సాయం అందించి తెలంగాణ వ్యాప్తంగా గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇటీవలి అకాల వర్షాలకు నష్టపోయిన రైతులకు ఆర్ధిక సాయం అందించాడు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ కు వచ్చిన ఆయన ఓ యువతితో లాడ్జిలో సరసాలు ఆడుతూ పట్టుబడ్డాడు.

Advertisement

సిద్ధిపేట రాజకీయాల్లో చ‌క్రం తిప్పాల‌ని త‌హ‌త‌హ‌లాడుతున్న చ‌క్ర‌ధ‌ర్ గౌడ్ మోసాల చిట్టా పెద్దగానే ఉందన్న ఆరోపణలు వస్తున్నాయి. చక్రధర్ గౌడ్ హైదరాబాద్ నాగార్జున సర్కిల్ ఎదురుగా ఉన్న మహీంద్రా షోరూమ్ పక్క బిల్డింగ్ లోని ఐద‌వ అంత‌స్తులో ఫార్మర్ ఫస్ట్ ఫౌండేషన్ నడుపుతున్నాడు. అదే బిల్డింగ్ లోని మూడో అంతస్తులో ఒక కన్సల్టెన్సీ పేరుతో ఆఫీస్ నడుపుతున్నాడు. అందులో తనకు నమ్మకస్తులైన యువతీయువకులను ఉంచి బోగస్ కంపెనీని రన్ చేస్తున్నారు. పలు ప్రాజెక్టుల పేరుతో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పి అమాయక యువతీ,యువకుల నుంచి డబ్బులను వసూళ్లు చేయడం చక్రధర్ గౌడ్ కంపెనీ టార్గెట్. ఇందుకోసం ఓ వ్యక్తి నుంచి 100-150వరకు ఆక్టివేట్ చేయబడిన సిమ్ లను తెప్పించుకుంటాడని తెలుస్తోంది. నౌకరి.కం లాంటి సైట్లలో ఉద్యోగాలకు అప్లై చేసుకున్న నిరుద్యోగుల వివరాలను సేకరించి వారి అవసరాన్ని క్యాష్ చేసుకోవడంలో చక్రధర్ గౌడ్ కంపెనీ నెంబర్ వన్ అని అంటున్నారు. వారి నుంచి డబ్బులను వసూళ్లు చేసిన అనంతరం సిమ్ కార్డులను విరిచి పడేసి ఎవరికీ దొరక్కుండా చీకటి వ్యాపారం కొనసాగిస్తున్నారు.

ఇదే కాదు.. గతంలో చక్రధర్ గౌడ్ దొంగ నోట్లు ముద్రణ కేసులో జైలుకు కూడా వెళ్ళాడు. ఆ సమయంలో పోలీసులకు రాసిన కంప్లైంట్ లెటర్ బయటకు రావడంతో అతనిలో ఎవరికీ కనిపించని విలన్ క్యారక్టర్ ఆ మధ్య బయటపడింది.కంప్లైంట్ లెటర్ లో తన తండ్రి ప్రోక్లయినర్ డ్రైవర్ గా పేర్కొన్నాడు. తాను చిన్న ఉద్యోగినని తెలిపాడు. తన పరిచయస్తుల ద్వారా ఈ దొంగ నోట్ల ముద్రణకు అలవాటు పడినట్లు పేర్కొన్నాడు. దీనిని సునిశితంగా గమనిస్తే చక్రధర్ గౌడ్ సామాన్య కుటుంబానికి చెందిన వ్యక్తిగా క్లియర్ గా అర్థం అవుతోంది. మ‌రి అలాంటి వ్య‌క్తి అనతి కాలంలో ఇంత‌లా ఎలా ఎదిగాడో అర్థం చేసుకోవచ్చు.

ఇటీవలి రేప్ అటెంప్ట్ కేసులో అరెస్ట్ అయిన చక్రధర్ గౌడ్.. ఇక బండారం బయటపడుతుందని..తన చరిత్రను మొత్తం ప్రభుత్వ పెద్దలు వెలికితీస్తారని భయపడే బీజేపీని ఆశ్రయించారనే విమర్శలు రాగా..ఈ విషయం ఇంకా మరిచిపోక ముందే మరో యువతీతో లాడ్జిలో పట్టుబడటం గమనార్హం.

Advertisement