Lawyer Sidharth Luthra : స్కిల్స్ స్కామ్ కేసులో రిమాండ్ లో ఉన్నటువంటి చంద్రబాబు తరపు న్యాయవాది సిద్ధార్థ లూత్ర ఆసక్తికర ట్విట్ చేశారు.అన్ని విధాలుగా ప్రయత్నించినప్పుడు న్యాయం కనుచూపుమేర లేనప్పుడు , కత్తి తీసి పోరాటం చేయడమే సరైనది అని గోవింద్ సింగ్ వ్యాఖ్యలను ట్విట్టర్ లో షేర్ చేశారు. ఈరోజు ఇదే మా నినాదమని ఆయన పేర్కొన్నారు. అయితే ప్రస్తుతం సిద్ధార్థ లూత్ర ట్విట్ పై పలువురు స్పందించారు. లాయర్ కు కత్తి కంటే పెన్ను పవర్ ఫుల్ అని ఓ వ్యక్తి కామెంట్ చేశాడు.
ఇక దీనికి లాయర్ లూత్రా స్పందించారు. లాయర్ కు కత్తి కంటేే చట్టమే పవర్ ఫుల్ అన్నారు. లా అనే ఆయుధమే లాయర్ కి బలాన్ని ఇస్తుందని వివరించారు. సుప్రీంకోర్టు సీనియర్ లాయర్ గా ఉన్న సిద్ధార్థ లూత్ర చంద్రబాబును అరెస్టు చేసిన రోజున ఢిల్లీ నుండి విజయవాడ వచ్చారు. ఆరోజు నుండి ఆయన విజయవాడలోనేే మక్కాం వేశారు. రిమాండ్ రిపోర్ట్ మొత్తం డోల్ల అని సరైన ప్రాథమిక ఆధారాలు కూడా లేవని చంద్రబాబును అరెస్ట్ చేయడం చట్టపరం కాదని, గవర్నర్ అనుమతి కూడా తీసుకోలేదని వాదించారు.
అన్ని తనకి అనుకూలంగా ఉన్నాయనుకున్న సిద్ధార్థ లూత్ర రిమాండర్ రిపోర్ట్ ను కొట్టి వేస్తారు అనుకున్నాడు. కానీ అనూహ్యంగా కోర్టు రిమాండ్ విధించడంతో ఆయన విజయవాడలోనే ఉండిపోయారు. అలాగే హౌస్ రిమైండర్ పిటిషన్ వేశారు. దీనిపై కూడా సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. అయినప్పటికీ సానుకూల ఫలితాలు రాలేదు. దాంతో క్వాష్ పిటిషన్ వేశారు తీర విచారణలో ప్రభుత్వ లాయర్ కౌంటర్ తాకలకు సమయం కావాలని కోరడంతో కోర్టు వారికి వారం రోజులు గడువు ఇచ్చింది. దీంతో మరో వారం రోజులు పాటు చంద్రబాబు జైల్లో ఉండనున్నారు. ఈ క్రమంలో న్యాయపరంగా తీసుకోవాల్సిన తదుపరి కార్యచరణ పై సిద్ధార్థ చంద్రబాబుతో సమావేశం కానున్నారు.
Motto for the day pic.twitter.com/gh0VsVYm8G
— Sidharth Luthra (@Luthra_Sidharth) September 13, 2023