Chandrababu Naidu : : టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు సెంట్రల్ జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ లో ఉన్నారని నిరూపిస్తూ చంద్రబాబును సిఐడి అధికారులు అరెస్ట్ చేయడం జరిగింది. అయితే అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 17 ఏ కింద గవర్నర్ అనుమతి లేకుండా తనపై నమోదు చేసిన స్కిల్ డెవలప్మెంట్ కేసును కొట్టేయాలని కోరుతూ చంద్రబాబు తరపు లాయర్లు సుప్రీంకోర్టులో పిటీషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ ను ఇటీవల మంగళవారం జస్టిస్ అనిరుద్ బోస్ మరియు జస్టిస్ బెలా ఎం త్రివేదితలతో కూడిన ధర్మాసనం ఈరోజు విచారణ చేయనుంది.
ఈ క్రమంలో చంద్రబాబు తరఫున సీనియర్ న్యాయవాది హరీష్ సాల్వే , ఏపీ ప్రభుత్వం తరఫున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహథి వారి వాదనాలను వినిపించనున్నారు. అయితే శుక్రవారం రోజు కోర్టు పనివేలలు ముగిసే సమయానికి ప్రభుత్వం తరపు వాదనలు పూర్తికానందున ఈరోజు మంగళవారం మధ్యాహ్నం విచారణ ప్రారంభమైన వెంటనే ముందుగా సీనియర్ న్యాయవాది ముకుల్ వాదలను కొనసాగిస్తున్నట్లు తెలుస్తోంది. తన వాదనను పూర్తి చేయడానికి మరో ఆరు గంటలు వ్యవధి కావాలని గత విచారణ సమయంలోనే ముకుల్ ధర్మాసానికి తెలియజేశారు. ఈ నేపథ్యంలో ముకుల్ వాదనలు పూర్తి అయిన తర్వాత చంద్రబాబు తరపు న్యాయవాది వారి యొక్క వాదనలను ప్రారంభిస్తారు.
ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం కల్లా ఇరుపక్షాల వాదనలు ముగిసేఅవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. అనంతరం ధర్మాసనం తీర్పును రిజర్వ్ చేస్తుందా..? లేకుంటే ఇంకేమైనా చెబుతుందా అనేది తీవ్ర ఆసక్తికరంగా మారింది. అయితే హైకోర్టులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ ను కొట్టేస్తూ ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాస్ రెడ్డి సెప్టెంబర్ 22న తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ తీర్పును సవాలు చేస్తూ చంద్రబాబు సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇక ఈ కేసు విచారణ సెప్టెంబరు 23 నుండి వాయిదాలతో సాగుతూ ఈరోజు మధ్యాహ్నం వాదనలు ముగిసిన తర్వాత ధర్మాసనం ఫైబర్ నెట్ కేసులో ముందస్తు విచారణ కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.