బీజేపీ, బీఆర్ఎస్ ఆశలు ఆవిరి – కాంగ్రెస్ లో నయా జోష్..?

మిషన్ కర్ణాటక విజయవంతంగా పూర్తి చేసిన కాంగ్రెస్ అధినాయకత్వం ఇప్పుడు తన దృష్టిని తెలంగాణపైకి మల్లిస్తోంది. కర్ణాటకలో అసంతృప్త నేతలనంతా ఎకతాటికిమీదకు తీసుకొచ్చిన విధంగా తెలంగాణలోనూ అదే తరహలో ఐక్యం చేయగలిగితే కాంగ్రెస్ సగం విజయాన్ని సాధించినట్లే. ఈ విషయాన్ని గుర్తించిన అధిష్టానం తన ఫోకస్ ను తెలంగాణపై కేంద్రీకరిస్తోంది.

Advertisement

ఎన్నికల వ్యూహకర్త సునీల్ కనుగోలు స్ట్రాటజిలతో ఇప్పటికే బీజేపీని వెనక్కి నెట్టి… రాష్ట్రంలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ అనే పరిస్థితిని క్రియేట్ చేశాడు రేవంత్. ఈ క్రమంలోనే వచ్చిన కర్ణాటక రిజల్ట్స్ బీజేపీని పూర్తిగా నిరాశపరిచాయి. కాంగ్రెస్ కు బూస్టింగ్ ఇచ్చాయి. కర్ణాటకలో విజయం సాధించి సౌత్ లో సత్తా చాటాలని… కర్ణాటకలో గెలిస్తే ఆ ప్రభావం తెలంగాణపై పడుతుందని లెక్కలేసుకున్నారు కమలనాథులు. కర్ణాటక గెలుపు తెలంగాణకు గెట్ వే అవుతుందని గంపెడు ఆశలు పెట్టుకున్నారు కానీ కాంగ్రెస్ బంపర్ మెజార్టీతో విజయం సాధించింది.

Advertisement

కర్ణాటక ఎన్నికల ప్రభావం తెలంగాణపై ఉండదని కేటీఆర్ విదేశాల్లో ఉండి ట్వీట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇదే కొత్త చర్చకు దారితీసింది. నిజంగా కర్ణాటక ఎలక్షన్ ఎఫెక్ట్ తెలంగాణపై పడకుంటే ఆయన విదేశాల్లో ఉండి అంత అర్జెంట్ గా ట్వీట్ చేయడం ఎందుకు..? కేటీఆర్ ఎందుకు భుజాలు తడుముకున్నట్లు..? అనే ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. కేటీఆర్ అంగీకరించినా, నిరాకరించినా కర్ణాటక ఎన్నికల ఎఫెక్ట్ తెలంగాణపై ఉంటుంది. బీజేపీ ఈ విషయంలో మరింత ఎక్కువగా భయపడుతుంది. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల గెలుపును తెలంగాణలో ప్రచారం చేసుకొని లబ్దిపొందాలని అమిత్ షా స్కెచ్ వేశారు కానీ కాంగ్రెస్ కు సానుకూల ఫలితం వచ్చింది.

కర్ణాటక ఎన్నికల ఫలితం బీఆర్ఎస్ – బీజేపీని నిరాశపరచగా కాంగ్రెస్ లో నూతనోత్తేజాన్ని నింపుతోంది. పైగా.. రైతు డిక్లరేషన్, యూత్ డిక్లరేషన్ ఓటర్లను బాగా టెంప్ట్ చేసేలా ఉన్నాయి. రైతు డిక్లరేషన్ ను ప్రజల్లోకి బాగా తీసుకెళ్ళారు కాని యూత్ డిక్లరేషన్ ను కూడా అదే స్థాయిలో తీసుకెళ్తే కాంగ్రెస్ గెలుపు అవకాశాలను ఏమాత్రం కొట్టేయలేం. భారీగా పెరిగిన ప్రభుత్వ వ్యతిరేకతతోపాటు కాంగ్రెస్ పై సానుభూతి పవనాలు, రేవంత్ రెడ్డి వన్ ఛాన్స్ , బై , బై కేసీఆర్ అనే స్లోగన్స్ జనాలను ఆలోచనలో పడేస్తున్నాయి. కాబట్టి… కర్ణాటక ఎన్నికల స్ట్రాటజీ ప్రకారం తెలంగాణలోనూ ముందుకు వెళ్తే కాంగ్రెస్ గెలుపును ఆపడం ఎవరితరం కాదని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు.

Advertisement