KCR vs Dalits : దళితులు కేసీఆర్ ను నమ్ముతున్నారా..?

Dalits still believe in KCR?
Dalits still believe in KCR?

దళితులను ప్రసన్నం చేసుకునేందుకు కేసీఆర్ అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. కేసీఆర్ దళిత వ్యతిరేకి అనే ముద్రను చేరిపెసుకోవాలని చూస్తున్నారు. ఇందులో భాగంగా ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 125అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఇప్పటికే దళిత జనోద్దరకుడు కేసీఆర్ అనే ప్రచారం చేసుకుంటున్న బీఆర్ఎస్ ఈ విగ్రహవిష్కరణ కార్యక్రమంతో ఈ ప్రచారాన్ని పీక్స్ కు తీసుకెళ్లనుంది. నగరం నడిబొడ్డున ట్యాంక్ బండ్ సమీపంలో అంబేడ్కర్ విగ్రహావిష్కరణ చేయడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అధికారిక కార్యక్రమాలు చేపట్టాలని బీఆర్ఎస్ ప్రకటించింది.

Advertisement

వాస్తవానికి ఎప్పుడో పూర్తికావాల్సిన అంబేద్కర్ విగ్రహావిష్కరణ చాలా ఆలస్యం అయింది. 2016లోనే విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ చేసిన కేసీఆర్ ఏడేళ్ళ తరువాత విగ్రహావిష్కరణ చేయబోతున్నారు. ఈ మధ్యలోనే ఆయన PragathiBhavan ప్రగతి భవన్ నిర్మించుకున్నారు. సచివాలయం ఆగమేఘాల మీద కట్టించుకున్నారు.  Farmhouse ఫామ్ హౌజ్ లు కొత్త హంగులతో నిర్మించుకున్నారు. ఎమ్మెల్యేల క్యాంప్ ఆఫీసుల నిర్మాణం పూర్తి చేసుకున్నారు. బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయాల నిర్మాణం పూర్తి చేసుకున్నారు కానీ అంబేద్కర్ విగ్రహ ఏర్పాటులో మాత్రం తీవ్ర జాప్యం జరిగింది. తీరా ఎన్నికలకు సమయం సమీపిస్తోన్న వేళ దొరహంకారి అనే ముద్రను తొలగించుకునేందుకు అంబేడ్కర్ విగ్రహావిష్కరణలో కేసీఆర్ స్పీడ్ పెంచారనే విమర్శలు ఉన్నాయి. విగ్రహం వల్లనే దళితులకు సాధికారిత వస్తుందా అన్న ప్రశ్నలు వినిపించకుండా రాజ్యాంగ నిర్మాతను గౌరవించుకుంటున్నామని సచివాలయానికి కూడా పేరు పెట్టామని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు.

Advertisement

Ambedkar అంబేడ్కర్ ను స్మరించుకోవడమే కాదు దళితులను ఆర్థికంగా నిలదొక్కునేలా పథకాలు ప్రారంభించామని చెప్పుకొస్తున్నారు. అంబేద్కర్ కన్న కళలను సాకారం చేస్తున్నామని చెబుతున్నారు. అయినప్పటికీ దళితుల్లో కేసీఆర్ పై అసంతృప్తి ఉంది. పైగా దళితుడిని ముఖ్యమంత్రిని చేస్తాననే హామీ, మూడెకరాల భూమి, ఎస్సీ సబ్ ప్లాన్ నిధుల విషయంపై కేసీఆర్ kcr పట్ల దళితుల్లో అసంతృప్తి ఉంది. వాటిని తిప్పికొట్టేందుకు దళిత బంధు ప్రవేశ పెట్టారు కానీ.. అది చాలా తక్కువ మందికి అందుతోంది. ఇప్పుడు విగ్రహం పెట్టి దళిత ఉద్దారకుడు కేసీఆర్ అని BRS PARTY బీఆర్ఎస్ విస్తృత ప్రచారం చేసుకుంటోంది.

Advertisement