ధర్మపురి స్ట్రాంగ్ రూమ్ కేసులో హైకోర్టు ఆదేశం

ధర్మపురి అసెంబ్లీ నియోజకవర్గం ఎన్నికల వివాదానికి సంబంధించి తెలంగాణ హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూమ్ తాళాలను పగలగొట్టి రీకౌంటింగ్ చేపట్టాలంటూ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో ధర్మపురి ఎన్నికల రీకౌంటింగ్ పై సర్వత్ర ఉత్కంట నెలకొంది.

Advertisement

పూర్తి వివరాల్లోకి వెళ్తే…ప్రస్తుతం మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తోన్న కొప్పుల ఈశ్వర్ 2018ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ధర్మపురి నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో 441ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ పై కొప్పుల గెలుపొందారు. అయితే… ఎన్నికల కౌంటింగ్ లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ కాంగ్రెస్ అభ్యర్థి అడ్లూరి లక్ష్మణ్ హైకోర్టును ఆశ్రయించారు.

Advertisement

ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యాయని… రీకౌంటింగ్ కు ఆదేశించాలని హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు..స్ట్రాంగ్ రూమ్ తాళాలను ఓపెన్ చేయాలనీ జిల్లా కలెక్టర్ ను ఆదేశించింది. హైకోర్టు ఆదేశాలతో ఈ నెల 10న వెళ్ళిన జిల్లా కలెక్టర్ షేక్ యస్మీన్ భాష స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్ అయ్యాయని నివేదించారు.

తాజాగా మరోసారి అడ్లూరి లక్ష్మణ్ పిటిషన్ పై హైకోర్టులో విచారణ జరగగా… స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్ అయ్యాయని కలెక్టర్ చెప్పడంతో హైకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈవీఎంలను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్ తాళాలు మిస్ అయితే సీల్ ను పగలగోట్టాలని ఆదేశించింది. అన్ని పార్టీల సమక్షంలోనే ఈ తంతు కొనసాగించాలని స్పష్టం చేసింది.

ఎన్నికల ఫలితాలు తారుమారు అయ్యాయని.. రీకౌంటింగ్ కోసం ఆయన కోర్టును కోరగా.. దీనిపై విచారణ చేపట్టింది. సదరు ఎన్నికల్లో 441 ఓట్ల తేడాతో కొప్పుల ఈశ్వర్ విజయం సాధించారు. ఎన్నికల కౌంటింగ్ లో చోటుచేసుకున్న అవకతవకల కారణంగా తానుఓడినట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు.

దీనికి సంబంధించిన తదుపరి విచారణను ఏప్రిల్ 24కు వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో.. రీకౌంటింగ్ ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఒకవేళ ఈ ఎన్నికల్లో ఫలితాల్లో రిజల్ట్ అడ్లూరి లక్మన్ కు అనుకూలంగా వచ్చిన ఆయన పదవిలో కొనసాగేది ఏడు నెలలు మాత్రమే.

Advertisement