Jagan : చంద్రబాబు అరెస్టుపై ఎట్టకేలకు స్పందించిన జగన్.. నాకేం సంబంధం లేదంటూ…

Jagan : టిడిపి అధినేత చంద్రబాబు అరెస్టుపై ఎట్టకేలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ స్పందించారు. చంద్రబాబుది కక్ష సాధింపు తో చేసిన అరెస్ట్ కాదని, తనకు ఆయనతో ఎలాంటి కక్ష లేదని సీఎం జగన్ తెలియజేశారు. అయితే ఇటీవల జరిగిన వైసిపి విస్తృత స్థాయి సమావేశంలో భాగంగా జగన్ మాట్లాడుతూ… తాను లండన్ లో ఉండగానే చంద్రబాబును పోలీసులు అరెస్ట్ చేశారని , ఇక కేంద్రంలో బిజెపి ఉందని , దత్తపుత్రుడు బిజెపితోనే ఉన్నాడని చెప్పుకొచ్చాడు. బిజెపి రాష్ట్ర అధ్యక్షులతో సహా సగం రాష్ట్రం బిజెపి నేతలు మరియు టిడిపి నేతలే ఉన్నారని , ఇక వారంతా కలిసి ఉన్నప్పుడు చంద్రబాబు అక్రమాలకు అవినీతికి పాల్పడ్డాడని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే చంద్రబాబు అవినీతిని పసిగట్టిన సిబిఐ ,ఈడి, జిఎస్టి , రంగంలోకి దిగాయని వారితో నాకేం సంబంధం అంటూ జగనన్నారు.

Advertisement

jagan-finally-responded-to-chandrababus-arrest

Advertisement

అందుకే చంద్రబాబు రాష్ట్రంలో సిబిఐ ని కూడా అడుగుపెట్టనివ్వనని ఒకానొక సందర్భంలో తీర్మానం ఇచ్చారని , గజదొంగల ముఠా వీరప్పన్ అయిన చంద్రబాబును సమర్ధించడం పేదవాడిని వ్యతిరేకించటమేనని జగన్ పేర్కొన్నారు. అలాగే పొత్తుల విషయం లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పై కూడా సీఎం జగన్ పంచులు పేల్చారు. రెండు సున్నాలు కలిసిన నాలుగు సున్నాలు కలిసిన వచ్చేది సున్నానేనని , ఒకడు పార్టీ పెట్టి 15 సంవత్సరాలు అవుతున్న ఇప్పటికీ నియోజకవర్గంలో నాయకులు లేరని జగన్ చెప్పుకొచ్చాడు. కొన్ని గ్రామాలలో వారి జండా మోసే కార్యకర్తలేరని అన్నారు.

jagan-finally-responded-to-chandrababus-arrest

ఇక చంద్రబాబు మోసాలు చేయడంలో అవినీతికి పాల్పడడంలో అతనికి పార్ట్నర్ దత్తపుత్రుడని జగన్ పేర్కొన్నారు. బిస్కెట్లను చాక్లెట్లను పంచిన మాదిరిగా దత్త పుత్రుడికి వారి అనుచరులను పంచుతున్నారని , రాజకీయం అంటే దోచుకోవడం , పంచుకోవడం జ్ తీసుకోవడం కాదు మనం చనిపోయిన తర్వాత కూడా ప్రతి ఇంట్లో మన ఫోటో ఉండాలనుకోవడం అంటూ జగన్ చెప్పారు. పేదవాడి చిరునవ్వుల్లో మనం గుర్తుకు రావాలి అది రాజకీయమంటే అంటూ మాట్లాడారు. ఇక చంద్రబాబు జైల్లో ఉన్న బయట ఉన్న పెద్ద తేడా ఏమీ లేదని , ఇక చంద్రబాబును చూడగానే గుర్తుకొచ్చేది మోసాలు అబద్ధాలు వెన్నుపోటు వంచనలని జగన్ పేర్కొన్నారు. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో జగన్ వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి.

Advertisement