KCR vs Modi : కేసీఆర్ వర్సెస్ మోదీ.. వార్ ఎట్ హైదరాబాద్.. గెలిచిందెవరు?

KCR vs Modi : ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగా ఎక్కడ చూసినా కేసీఆర్ వర్సెస్ మోదీ అన్నట్టుగానే ఉంది. బీజేపీ సమావేశం కోసం హైదరాబాద్ కు వచ్చిన మోదీకి అడుగడుగునా కేసీఆర్ సారథ్యంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం అడ్డంకులు సృష్టించేందుకు ప్రయత్నించింది. తెలంగాణకు ఢిల్లీ నుంచి మిడుతల దండు వస్తోంది. ఆకుపచ్చని తెలంగాణను నాశనం చేయడానికి వస్తున్న మిడుతల దండును తెలంగాణ నుంచి తరిమికొట్టాలంటూ టీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ పార్టీపై వ్యతిరేకంగా ప్రచారాలు చేసింది.

Advertisement
kcr vs modi bjp meeting held in hyderabad
kcr vs modi bjp meeting held in hyderabad

హైదరాబాద్ లో అయితే ఇక చెప్పక్కర్లేదు.. ఎక్కడ చూసినా.. మోదీకి వ్యతిరేకంగా హోర్డింగ్సే. సరికొత్తగా టీఆర్ఎస్ పార్టీ మోదీపై నిరసనను తెలిపింది. మోదీ వస్తున్నారని తెలిసి.. మా ప్రశ్నలకు సమాధానాలు చెప్పండి మోదీ.. తెలంగాణకు కేంద్రం ఏం చేసిందో చెప్పాలంటూ ప్రధాని మోదీని లక్ష్యంగా చేసుకొని సీఎం కేసీఆర్ చేసిన ప్రసంగం ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

Advertisement

KCR vs Modi : కేసీఆర్ ఊసే లేని మోదీ ప్రసంగం

అయితే.. బీజేపీ జాతీయ సమావేశాల్లో పాల్గొన ప్రధాని మోదీ.. ఏం మాట్లాడుతారో అని అంతా ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ.. మోదీ ప్రసంగంలో అంత పస లేదు. మోదీ కేసీఆర్ గురించి కానీ.. టీఆర్ఎస్ పార్టీ గురించి కానీ.. ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మోదీ ప్రసంగం మొత్తం.. కేంద్రం చేస్తున్న కార్యక్రమాల గురించే. పింఛన్లు, ఉచిత బియ్యం.. అలాగే వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ప్రజలు బీజేపీని ఆదరించాలంటూ ప్రసంగించారు తప్పితే.. ఎక్కడా తెలంగాణకు ప్రత్యేకంగా కేంద్రం ఏం చేసింది అనే విషయాన్ని మాత్రం మోదీ చెప్పలేకపోయారు.

అసలు కేసీఆర్ చేసిన వ్యాఖ్యల గురించి కానీ.. కేసీఆర్ సంధించిన ప్రశ్నలకు కానీ.. మోదీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. బీజేపీని తెలంగాణ ప్రజలు ఎందుకు ఆదరించాలి అని చెప్పలేకపోయారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వం వస్తుందన్నారు కానీ.. ఎలా వస్తుందో చెప్పలేకపోయారు.

అన్ని రాష్ట్రాలకు ఇస్తున్నట్టే తెలంగాణకు కూడా కేంద్రం ఇస్తోంది. ఇందులో తెలంగాణకు ప్రత్యేకంగా చేస్తున్నది ఏం లేదు కదా. మరి.. ఎన్నికల సమయంలో ఇంత దూరం వచ్చి.. బీజేపీ పార్టీని అధికారంలోకి తీసుకురావాలనుకున్న మోదీ.. ఇలా చప్పగా మాట్లాడటం ఏంటి అంటూ రాజకీయ విశ్లేషకులు పెదవి విరుస్తున్నారు. దీంతో మోదీతో పోరులో కేసీఆర్ దే పై చేయి అయింది. కేసీఆర్ అడిగిన ప్రశ్నలకు మోదీ సమాధానం చెప్పినా.. ప్రత్యేకించి తెలంగాణకు ఏం చేస్తున్నామో చెప్పినా మోదీ ప్రసంగానికి ఒక విలువ ఉండేది. కానీ.. అదేం లేకుండా.. ఏదో నామ్ కే వాస్తే మోదీ మాట్లాడినట్టుగా అనిపిస్తోంది. దీంతో మోదీపై కేసీఆర్ దే గెలుపు అన్నట్టుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి.

Advertisement