Raja Singh : హైదరాబాద్ లోని గోషామహల్ నియోజకవర్గం బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ తెలుసు కదా. గత కొన్ని రోజుల నుంచి రాజా సింగ్ గురించే చర్చ నడుస్తోంది. నిజానికి రాజా సింగ్ ది తెలంగాణ కాదు. ఆయనది నార్త్ ఇండియా. అక్కడి నుంచి హైదరాబాద్ కు వచ్చి ఇక్కడే స్థిరపడిపోయాడు. రాజకీయాల్లో చేరి ఎమ్మెల్యే స్థాయికి చేరాడు. కానీ.. ఓ వర్గంపై ఆయన చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం తెలంగాణ వ్యాప్తంగానే కాదు..యావత్ దేశమంతా చర్చనీయాంశం అయ్యాయి.

వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో రాజా సింగ్ ఎప్పుడూ ముందుంటాడు. అలాగే ఆయన ఫేమస్ అయ్యాడు కూడా. కేవలం ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యే అయి ఉండి ఇప్పుడు దేశమంతా ఆయన గురించి మాట్లాడుకునేలా చేసుకున్నాడు అంటే.. ఆయన వెనుక ఎంత మైండ్ గేమ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.
Raja Singh : బీజేపీ సస్పెండ్ చేయడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి?
ఓ వర్గంపై, ఆ వర్గం దేవుడిపై ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని ఆయన మీద పలు కేసులు నమోదు అయ్యాయి. ఆయన్ను అరెస్ట్ చేయాలంటూ ఆ వర్గం వాళ్లు చేసిన నిరసనలను అన్నింటినీ దృష్టిలో పెట్టుకొని బీజేపీ పార్టీ ఆయన్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. సొంత పార్టీనే ఆయన్ను సస్పెండ్ అయితే చేసింది కానీ.. ఈ ఇష్యూ వల్ల ఆయన నేషనల్ ఫిగర్ అయిపోయాడు.
రాజాసింగ్ ను అరెస్ట్ చేయడంతో పాటు.. కోర్టు ఉత్తర్వులతో విడుదల చేశారు. ఇటీవల నుపుర్ శర్మ కూడా ఇలాంటి వ్యాఖ్యలనే చేసింది. తాజాగా రాజాసింగ్ కూడా ఇలాంటి వ్యాఖ్యలు చేసి పాపులర్ అయ్యాడు. అయితే.. ఈయనకు ఓ వర్గం నుంచి మద్దతు లభిస్తోంది. రాజాసింగ్ ఏ వర్గం దేవుడినీ కించపరచలేదంటూ కొందరు ఆయనకు సపోర్ట్ గా నిలుస్తున్నారు.
ఏది ఏమైనా.. రాజా సింగ్ ను బీజేపీ సస్పెండ్ చేయడం వెనుక పెద్ద మైండ్ గేమ్ ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎందుకంటే.. త్వరలో మునుగోడు ఎన్నికలు రానున్న నేపథ్యంలో మతాల మధ్య చిచ్చు పెట్టే పార్టీగా బీజేపీ మిగిలిపోకూడదని.. మతాల మీద వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తే ఎవ్వరినీ సహించం.. ఎవ్వరినైనా పార్ట నుంచి సస్పెండ్ చేస్తామని బీజేపీ ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు ఈ చర్యలకు పూనుకుందని.. ఇదంతా ఎన్నికల స్టంట్ అని కూడా అనుమానిస్తున్నారు. ఏది ఏమైనా.. మొత్తానికి రాజా సింగ్ మాత్రం ప్రస్తుతం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయిపోయాడు. ఈ మాత్రం పాపులారిటీ చాలదూ.. భవిష్యత్తులో రాజకీయాల్లో ఇంకా ఎదగడానికి.