Modi – Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి ఏదైనా కొంచెం చేస్తే.. అతిగా పబ్లిషిటీ చేసుకునే అలవాటు ఉందని కొందరు విశ్లేషకులు చెబుతుంటారు. ఇటీవల ప్రధాని మోదీ.. చంద్రబాబుతో ఓ ఐదు నిమిషాలు మాట్లాడితేనే టీడీపీ నేతలు ఆహో… ఓహో అంటూ తెగ హడావుడి చేశారు. ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సమావేశంలో చంద్రబాబుతో ప్రధాని మాట్లాడింది కేవలం ఐదు నిమిషాలు మాత్రమే. కానీ.. టీడీపీ అనుకూల మీడియా మాత్రం దాన్ని బాగా హైలెట్ చేసింది. టీడీపీ నేతలు కూడా ఆ భేటీని తెగ ఊహించుకున్నారు.

వాళ్ల భేటీపై వైసీపీ నేతలు తప్పు పట్టారు. ప్రధాని మోదీ 5 నిమిషాలు మాట్లాడితేనే అంతలా రెచ్చిపోవాలా? మరి సీఎం జగన్ తో ప్రధాని డిన్నర్ టేబుల్ పై గంట సేపు చర్చించారంటూ వైసీపీ నేతలు చెప్పుకొచ్చారు. గంట సేపు ప్రధానితో చర్చించినా కూడా వైఎస్ జగన్ దాని గురించి ఎప్పుడూ చెప్పలేదని.. దాన్ని ప్రచారానికి వాడుకోలేదని వైసీపీ నేతలు స్పష్టం చేస్తున్నారు.
Modi – Chandrababu : నీతి ఆయోగ్ సమావేశం తర్వాత మోదీ, జగన్ డిన్నర్
నీతి ఆయోగ్ సమావేశం తర్వాత ప్రధాని నరేంద్ర మోదీతో కలసి జగన్ డిన్నర్ చేసిన విషయం తెలిసిందే. ఆ సమయంలో ప్రధాని మోదీతో కలిసి డిన్నర్ చేసే అవకాశం కేవలం ముగ్గురు ముఖ్యమంత్రులకే వచ్చింది. అందులో సీఎం జగన్ ఒకరు.
డిన్నర్ సమయంలో గంటకు పైగా పలు అంశాలపై ప్రధాని నరేంద్ర మోదీ, జగన్ మధ్య చాలా చర్చలు జరిగాయి. కానీ.. ప్రధాని మోదీతో జరిగిన భేటీ గురించి జగన్ ఎక్కడా ప్రస్తావించలేదు. ప్రచారమూ చేసుకోలేదు. కానీ.. చంద్రబాబు మాత్రం మోదీ పలకరించగానే పులకరించిపోయారు. పచ్చ మీడియా తన ప్రతాపాన్ని చూపించింది అంటూ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
రాష్ట్రంలో అమలు చేస్తున్న పథకాలు, కార్యక్రమాలు, పరిపాలన వికేంద్రీకరణ, వ్యవసాయానికి ఇచ్చే ప్రాధాన్యం లాంటి అంశాలపై సీఎం జగన్.. నీతి ఆయోగ్ మీటింగ్ లో వెల్లడించారు. అంతే కాదు.. జగన్ ప్రసంగాన్ని ప్రధాని మోదీతో పాటు పలువురు మంత్రులు కూడా మెచ్చుకున్నారు. చంద్రబాబులా జగన్ కు ప్రచారం మీద యావ ఉండదు అని మరోసారి తేటతెల్లం అయిందని వైసీపీ నేతలు కూడా అంటున్నారు.