Rajinikanth : రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉన్న టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడుని పరామర్శించేందుకు సూపర్ స్టార్ రజనీకాంత్ వస్తున్నట్లుగా తెలుగుదేశం పార్టీ నేతలు జోరుగా ప్రసారం చేస్తున్నారు. నిజానికి చంద్రబాబు నాయుడుకి అత్యంత సన్నిహితుడుగా సూపర్ స్టార్ రజినీకాంత్ ఉంటున్నాడు. ఇటీవల చంద్రబాబు నాయుడు అరెస్ట్ రిమైండర్ నేపథ్యంలో రజనీకాంత్ ఫోన్ చేసి నారా లోకేష్ ను పరామర్శించారు. ఇక్కడ గల పరిస్థితులను రజనీకాంత్ అడిగి తెలుసుకున్నారు. తాజాగా ఈయన రాక సందర్భంగా తెలుగుదేశం పార్టీ నేతల లో నూతన ఉత్సాహం రానుందని తెలుస్తోంది.
ఇప్పటికే జనసేన తెలుగుదేశం పార్టీ కలిసి పోటీ చేస్తాయని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రకటించారు. ఈ తరుణంలో తెలుగుదేశం పార్టీ నేతలు కొన్ని ప్రాంతాలలో సంబరాలు చేసుకుంటున్నారు. అదే తరుణంలో చంద్రబాబును కలిసేందుకు సూపర్ స్టార్ రజినీకాంత్ వస్తున్నారని తెలియడంతో నూతన ఉత్సాహం మొదలైంది.అయితే చంద్రబాబు రజనీకాంత్ కలుస్తారా లేదా అన్నది సందిగ్ధంలో ఉంది. దీనికి గల ప్రధాన కారణం మూలాఖత్ వారంలో రెండు రోజులు మాత్రమే. జైలు అధికారులు బాధ్యత కుటుంబ సభ్యులకు కానీ స్నేహితులకు కానీ అందజేస్తారు. అయితే చంద్రబాబు నాయుడుకు సంబంధించి రెండు ములాకత్ ఈ వారానికి ముగిశాయి.
అయితే శుక్రవారం ఉదయం నారా చంద్రబాబునాయుడు భార్య నారా భువనేశ్వరి కోడలు నారా బ్రాహ్మణి చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ జైలు అధికారులు మొలకత్ రెండు రోజులు మాత్రమే ఉంటుందని తెలియజేశారు. ఇలాంటి పరిస్థితులలో చంద్రబాబు నాయుడుని రజనీకాంత్ కలుస్తారా అనేది ఉత్కంఠంగా మారింది. మరోవైపు సూపర్ స్టార్ రజినీకాంత్ నిజంగా చంద్రబాబును కలిసేందుకు వస్తున్నారా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ రాజమండ్రి కి రజనీకాంత్ వచ్చినట్లయితే చంద్రబాబు కుటుంబాన్ని కూడా పరామర్శించే అవకాశం ఉంది. అయితే ప్రస్తుతం చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ ఢిల్లీలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రజనీకాంత్ వస్తారా…వస్తే చంద్రబాబును కలిసే పరిమిషన్ దొరుకుతుందా..అనేది ఉత్కంఠంగా మారింది.