Chandrababu Naidu : ఆంధ్రప్రదేశ్ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టిడిపి పార్టీ అధినేత చంద్రబాబుకిి కోర్టు భారీ షాక్ ఇచ్చింది. 45 ఏళ్ల రాజకీయ జీవితంలో చంద్రబాబు తొలిసారి జ్యూడిషియల్ రిమాండ్ కు వెళ్లారు.ఆదివారం సాయంత్రం ఎసిపి కోర్టు చంద్రబాబుకు రిమాండ్ విధించింది. కోర్టు ఆదేశాల మేరకు సిఐడి పోలీసులు చంద్రబాబును రాజమహేంద్రవరం సెంట్రల్ జైలుకు తరలించారు. తీర్పు అనంతరం వానలో నే చంద్రబాబు వాహనం రాజమహేంద్రవరం బయలుదేరింది. ఆదివారం అర్ధరాత్రి 1.16 నిమిషాలకి చంద్రబాబు వాహన శ్రేణి రాజమహేంద్రవరం సెంట్రల్ జైలు వద్ద కు చేరుకుంది.
కోర్టు ఆదేశాల మేరకు జైలు అధికారులు చంద్రబాబుకు స్నేహ బ్లాక్ లో ప్రత్యేక గది ని సిద్ధం చేశారు. కోర్టు ఆదేశాల మేరకు చంద్రబాబుకి అన్ని రకాల వసతులను ఏర్పాటు చేశారు.ఇక చంద్రబాబుకు రిమాండ్ ఖైదీ నెంబర్ 7691 కేటాయించారు. అయితే జైలు గేటు దగ్గర నుండి ఎన్ఎస్పి కమాండోలు వెనక్కి వెళ్లిపోయారు. అనంతరం లోకేష్ లోపలికి వెళ్లి చంద్రబాబుకు ఇవ్వాల్సిన ఆహారం మరియు మందుల గురించి అధికారులతో మాట్లాడారు. అలాగే కుటుంబ సభ్యులు చంద్రబాబును ఏ సమయంలో కలవాలో అడిగి తెలుసుకున్నారు.
అయితే రాజమహేంద్రవరం జైల్లో తనకు ప్రత్యేక వసతులు కల్పించాలని చంద్రబాబు కోర్టును అభ్యర్థించారు. తన వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితి దృష్ట్యా జైల్లో తనకు ప్రత్యేక వసతులు అవసరమని చంద్రబాబు కోర్టుకు తెలియజేశారు. దీంతో కోర్టు చంద్రబాబుకు జైల్లో ప్రత్యేక వసతులు కల్పించాలని ఆదేశాలు జారీ చేసింది. అలాగే చంద్రబాబు బయట నుండి ఆహారం తెప్పించుకునే వెసులుబాటు కల్పించింది. చంద్రబాబును అరెస్ట్ చేసిన నేపథ్యంలో రాజమహేంద్రవరం జైలు వద్ద సుమారు 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.