KCR vs Tamilisai : కేసీఆర్ వర్సెస్ తమిళిసై.. వివాదం ఇక ముగిసినట్టేనా?

KCR vs Tamilisai : గత కొన్ని రోజుల నుంచి తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్న చర్చ ఇదే. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, గవర్నర్ తమిళిసై మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోందని. దాదాపు సంవత్సరం కావస్తోంది. రాజ్ భవన్ కు కేసీఆర్ వెళ్లడం లేదు. గవర్నర్ కూడా తన పరిధిలో ఉన్న కొన్ని ఫైల్స్ పై సంతకం పెట్టేందుకు కూడా ససేమిరా అనడం.. ఇలా పరోక్షంగా.. ఇద్దరి మధ్య ఒక యుద్ధమే జరుగుతుండేది.

Advertisement
telangana cm kcr versus telangana governor tamilisai
telangana cm kcr versus telangana governor tamilisai

కానీ.. ఆ యుద్ధానికి ఇక తెర పడినట్టే అనిపిస్తోంది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జిల్ భుయాన్ ప్రమాణ స్వీకారం రాజ్ భవన్ లో జరిగింది. దానికి సీఎం కేసీఆర్ కూడా హాజరయ్యారు. అక్కడే గవర్నర్ తమిళిసై.. కేసీఆర్ ను ఆత్మీయంగా స్వాగతించారు. ఇద్దరూ ఆత్మీయంగా పలకరించుకున్నారు. తేనేటి విందును ఇద్దరూ కలిసి స్వీకరించడం.. ఇద్దరూ కాసేపు మాట్లాడుకోవడం చూస్తుంటే.. ఇద్దరి మధ్య ఉన్న వివాదం ఇక ముగిసినట్టే అని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Advertisement

KCR vs Tamilisai : ఇక నుంచి కేసీఆర్ కు గవర్నర్ సహకరిస్తారా?

చాలా సమయాల్లో సీఎం తీరును గవర్నర్ తప్పుపట్టారు. ప్రభుత్వ తీరుపై ప్రెస్ మీట్స్ ను కూడా విడుదల చేశారు. మేడారం జాతరలోనూ గవర్నర్ కు అవమానం జరిగినట్టు వార్తలు వచ్చాయి. అంతే కాదు.. రాజ్ భవన్ లో గవర్నర్ మహిళా దర్భార్ ను నిర్వహించడం కూడా సీఎం కేసీఆర్ కు కోపం తెప్పించినట్టు తెలుస్తోంది.

కానీ.. తాజాగా జరిగిన కార్యక్రమంలో ఇద్దరూ ఆత్మీయంగా పలకరించుకోవడంతో.. ఇద్దరి మధ్య ఉన్న వివాదానికి ఇక తెర పడినట్టే.. ఇక నుంచి ఒకరికి మరొకరు సహకరించుకుంటారని.. గవర్నర్ కూడా సీఎం కేసీఆర్ కు అన్ని విధాలా సహకరిస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. చూద్దాం మరి.. భవిష్యత్తులో ఇంకా ఏమైనా సమస్యలు వస్తాయా? లేక.. ప్రభుత్వానికి గవర్నర్.. గవర్నర్ కు ప్రభుత్వం సహకరిస్తుందా?

Advertisement