Pawan Kalyan : ప్రస్తుతం తెలంగాణలో ఎక్కడ చూసినా మునుగోడు ఉపఎన్నిక గురించే చర్చ. మునుగోడు ఉపఎన్నికల్లో ఎలాగైనా గెలుస్తామని బీజేపీ చాలా ధైర్యంతో ఉంది. ఎందుకంటే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి బీజేపీలో చేరడం, ఆయనకు మునుగోడులో ఉన్న ఫాలోయింగ్ దృష్ట్యా.. మునుగోడు ఉపఎన్నికలో మళ్లీ రాజగోపాల్ రెడ్డిదే విజయం అని బీజేపీ నేతలు చెబుతున్నారు.

అది అలా ఉంచితే జనసేన పార్టీ బీజేపీతో పొత్తు కూడింది. ఏపీలో బీజేపీతో పొత్తు పెట్టుకున్న జనసేన తెలంగాణలోనూ బీజేపీతో పొత్తుపెట్టుకుందా అనే విషయం మాత్రం తెలియదు. మరోవైపు తెలంగాణలో జనసేన యాక్టివ్ గా ఉందని చెబుతున్న పవన్ కళ్యాణ్… మునుగోడు ఉపఎన్నికల్లో మాత్రం పోటీ చేయడం లేదని చెబుతున్నారు. పోనీ.. బీజేపీకి మద్దతు ఇస్తున్నారా అంటే అదీ లేదు.
Pawan Kalyan : కేటీఆర్ కు స్నేహం చాటిన పవన్
నిజానికి.. తెలంగాణలో పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తో పాటు మెగాస్టార్ ఫ్యాన్స్ కూడా చాలామందే ఉన్నారు. కానీ.. పవన్ కళ్యాణ్ మాత్రం తెలంగాణ కంటే కూడా ఏపీలోనే ఎక్కువ ఫోకస్ పెట్టారు. ఏపీలో వైసీపీని అధికారంలోకి రాకుండా చేయడమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నారు పవన్ కళ్యాణ్. అదంతా ఓకే కానీ.. తెలంగాణ విషయంలోనే ఎటూ తేల్చడం లేదు.
కేవలం విద్వేష రాజకీయాలను ప్రోత్సహించకూడదనే ఉద్దేశంతో తాను మునుగోడు ఉపఎన్నికల్లో పోటీ చేయడం లేదని పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. తెలంగాణ సీఎం కేసీఆర్ తరహాలో వ్యూహాలు రచిస్తానని చెబుతున్నారు. మంత్రి కేటీఆర్ తోనూ స్నేహంగా ఉంటున్నారు. ఇవన్నీ చూస్తుంటే.. తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీతో జతకట్టి.. వచ్చే ఎన్నికల్లో పవన్ పోటీ చేస్తారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఎలాగూ తెలంగాణలో ఉన్న పవన్ కళ్యాణ్, చిరంజీవి ఫ్యాన్స్ జనసేనకు ఓటేస్తే.. అది టీఆర్ఎస్ కు అనుకూలం అయి.. కాంగ్రెస్, బీజేపీలకు దెబ్బ పడుతుందని కేసీఆర్ ప్లాన్ వేశారా? అందుకే పవన్ తో టీఆర్ఎస్ మంచిగా ఉంటుందా? పవన్ కూడా టీఆర్ఎస్ తో జతకట్టేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారా అనేది తెలియడం లేదు. ఏది ఏమైనా.. మనుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తెలంగాణ రాజకీయాలు ఒక్కసారిగా మారిపోయాయి.