Sharmila : షర్మిల పాలేరులో నెగ్గుతుందా? ఎన్నికలలో పోటీపై ఆమె ప్రకటన వెనుక వ్యూహమేంటి?

Sharmila : పాలేరులో పోటీ చేయాలనేది మీ కోరిక మాత్రమే కాదు, నాకోరిక కూడా…ఈ రోజు నుండి షర్మిల ఊరు పాలేరు .. వైయస్సార్ బిడ్డ పాలేరులో పోటీ చేసేందుకు దేవుడు కూడా తధాస్థు అంటాడని నా నమ్మకం.. పాలేరు లో గెలవటానికి కాదు… అఖండ మెజారిటీ పొందటానికే.. తెలంగాణ రాష్ట్రంలో మొట్ట మొదట పాలేరులోనే వైయస్సార్ టిపి జండా ఎగరాలి అంటూ ఆ పార్టీ అధినేత్రి వైయస్ షర్మిల ఈ నెల 19న ఖమ్మం జిల్లా నేలకొండపల్లిలో ఏర్పాటు చేసిన పాలేరు ముఖ్య కార్యకర్యల సమావేశంలో చేసిన ప్రకటన జిల్లా రాజకీయాలలో కాస్త సంచలనమే కల్గించింది.

Advertisement

ప్రజా ప్రస్థానం పేరిట రాష్ట్రంలో షర్మిల చేస్తున్న పాదయాత్ర ఖమ్మం జిల్లాలో ముగింపు రోజున, 99 వ రోజు నేలకొండపల్లిలో ఆమె ఈ ప్రకటన చేశారు. అయితే షర్మిల కు పాలేరులో గెలుపు నల్లేరు మీదనడకే అవుతుందా, ఆమెకు ఇక్కడ కలిసొచ్చే అంశాలేంటి, పాలేరు ప్రజలు కొత్తదనం కోరుకుంటున్నారా, నిజంగానే ఆమె పాలేరులో పోటీ చేస్తున్నారా, ఇక్కడే ఎందుకు ఆమె పోటీ చేస్తున్నారు అనే విషయాలను ఒక్కసారి పరిశీలిస్తే…

Advertisement

Sharmila : సేఫ్ జోన్ ఎందుకంటే….

Will Sharmila win in Paleru
Will Sharmila win in Paleru

షర్మిల తెలంగాణ రాష్ట్రంలో జరగబోయే శాసనసభ ఎన్నికలలో ఎట్టి పరిస్థితులలో ఒంటరిగా పోటీ చేసే అవకాశమే లేదు.. అయితే ఆమె మాత్రం ఓ జాతీయ పార్టీతొ పొత్తు పెట్టుకుని ముందుకు సాగాలనే నిర్ణయానికి వచ్చారనే చర్చ విపరీతంగా సాగుతుంది… ఇప్పటికే ఆ జాతీయ పార్టీతో సీట్ల పంపకాలపై కూడా విస్తృత చర్చలు జరిగాయనేది సారాంశం, కాని ఆమె కోరుకున్న సీట్లు ఇచ్చేందుకు తర్జనభర్జనలు జరుగుతున్నట్లూ తెలుస్తుంది.. అయితే షర్మిల తో పోత్తుకు ఆ పార్టీ ఇరువురి ప్రయోజనాల దృష్ఠ్యా, ప్రభుత్వంలో ఉన్న టిఆరెస్ వ్యతిరేక ఓటు చీలి నష్ఠం కల్గకుండా ఉండేందుకు సై అంటున్నా, ఆమె కోరుకున్న సీట్ల సంఖ్య పైనే ఏకాభిప్రాయం రాలేదని , మరికొద్దిరోజుల్లో ఆ విషయాల పై చర్చలు పూర్తి గావిస్తారని సమాచారం..

ఓక వేళ ఈ పొత్తు సఫలమైతే ముందుగానే ఆమె పాలేరును సేఫ్ జోన్ గా ఊహించి ఇక్కడ పోటీ చేసేందుకే సుముఖంగా ఉన్నారని సమాచారం…

వైఎస్ షర్మిల పార్టీ ఏర్పాటు దగ్గర నుండి వైయస్సార్ సంక్షేమ పాలనే ధ్యేయంగా అడుగులు వేస్తున్నారు… వైయస్సార్ ప్రభుత్వంలో అమలు చేసిన ప్రజా, రైతు సంక్షేమ పధకాలు, ఇప్పటి టీఆరెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపైనే ఎక్కువ ఫోకస్ చేశారు.. ఈ క్రమంలో పాలేరు లో కాంగ్రెస్ 80శాతం ఫలితాలు గతంలో జరిగిన ఎన్నికలలో సాధించటం, వైయస్సార్ అభిమానులు ఉండటం తో పాటు, రెడ్డి సామాజిక ఓట్లు, ఆ సామాజిక వర్గం ప్రభావితం చేసే గ్రామాలు అధికంగా ఉండటం, ఎస్సీ-ఎస్టీ ప్రజల్లో ఎక్కువ భాగం కాంగ్రెస్ పార్టీని అంటిపెట్టుకున్న పరిస్థితులలో,కాంగ్రెస్ కు సరియైన అభ్యర్ధి కోసం వెదకటం, ఇక టిఆరెస్ లో రెండు వర్గాలగా విడిపోయి సీటు కోసం ప్రయత్నాలు చేయటం వంటి అంశాలు బలంగా పనిచేస్తాయనే నమ్మకమే షర్మిల చాయిస్ పాలేరు అయ్యిందని సీనియర్ జర్నలిస్టుల అభిప్రాయం కూడా…

Sharmila : నిజంగానే షర్మిల పాలేరులో పోటీ చేస్తుందా…

మాట తప్పం మడమ తిప్పమనే నినాదంతో ముందుకు వెళ్తున్న వైయస్సార్ కుటుంబంలోని షర్మిల అన్ని వ్యవహారాలు చక్కబడితే పాలేరులొనే ఆమె పోటీ చేయవచ్చు.. కాని వైయస్ షర్మిల కు పాలేరు నియోజక వర్గం మాత్రం ప్రధమ ప్రాధాన్యత కాదు అనేది రాజకీయ విశ్లేషకుల మాట…కేవలం పాలేరు అనేది కూడా ఆమె పోటీకి ఒక అవకాశం ఏర్పాటు చెసుకునేందుకే ముందస్థు ప్రకటన చేశారని వినికిడి…ఇంకోక విషయమేమిటంటే షర్మిల పాలేరులో సొంతంగా పోటీ చేస్తే మాత్రం బంగపాటు తప్పదనే అభిప్రాయం వ్యక్తమౌతుంది… 15 సార్లు ఎన్నికలు జరిగిన పాలేరులో షర్మిల పోటీ చేసినా, బ్యాలెట్ పై హస్తం గుర్తు కన్పడితే మాత్రం ఓటు మొత్తం కూడా కాంగ్రెస్ కే పడ్తాయని, ఒక వేళ రాజశేఖర రెడ్డి అభిమానంతో కొన్ని ఓట్లు షర్మిల కు ప్లస్ అయినా కూడ ఆ జరగబోయే నష్ఠం ఇటు కాంగ్రెస్, అటు వైయస్సార్ టిపికి బ్లాక్ హోల్ గానే పరిగణించవచ్చు…

మరెక్కడ నుండి షర్మిల పోటీ ఉండవచ్చు…

పాలేరును ఓ సేఫ్ జోన్ గా నే ఖర్చీప్ వేసిన షర్మిల, పోటీ మాత్రం ఉమ్మడి నల్గొండ జిల్లాలోని కోదాడ తప్పక అయి ఉండవచ్చను అనే అభిప్రాయానికి ఇప్పటికే వివిధ పార్టీ శ్రేణులు వచ్చాయి… కోదాడ నియోజకవర్గం లోకి ఎంటరయ్యే తన పాదయాత్ర 100వ రోజున అక్కడ సమీకరించిన జనం, భర్త అనిల్ ఏర్పాటు చేసిన సువార్త సభలు, విపరీత మైన ప్రజల నుండి అనూహ్య ఆదరణ లభించటం, 99 రోజుల ప్రజాప్రస్థానంలో ప్రజల ఆదరణ తో పోలిస్తే ఆ నియోజకవర్గంలో భారీ సమీకరణ, పాలేరు నియోజకవర్గంతో పోలిస్తే, అక్కడ కూడా ఆంధ్రాలోని రెండు జిల్లాలకు సరిహద్దుగా అనుబంధం ఉండటం, ఎక్కువగా ఆంధ్ర నుండి వచ్చి స్థిరపడిన వారి ఓట్లు ఉండటమే కాకుండా, కాంగ్రెస్ గెలుపు అవకాశం కూడా ఎక్కువగా ఉన్న నియోజకవర్గం కావటం వలననే, షర్మిల మొదటి ప్రాధాన్యత ఆ నియోజకవర్గమే అవుతుందని, తన అంతరంగీకులు కూడా దృవీకరిస్టున్నరు… అంతే కాకుండా ఆ నియోజకవర్గం లో ఏఐసిసి నిబందనల ప్రకారం కుటుంబంలో ఒక్కరికే అవకాశం ఇవ్వాల్సి ఉంటుందని, అందువలన కొత్త వ్యక్తికే అక్కడ భీ పారం ఇవ్వాల్సి ఉంటుంది కనుక, గతంలో కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించడం , స్థానిక ఎమ్మెల్యే పై ప్రజలలో తీవ్ర వ్యతిరేకత, అసహనం కారణంగానే ఆమె ఉమ్మడి నల్గొండ జిల్లాలోని ఆ నియోజకవర్గంను పక్కాగా ఎంపిక చేస్కున్నట్లు విశ్వసనీయ సమాచారం. దీనికి అణుగుణంగానే ఇప్పటికే పలు సర్వేలు, ప్రజాస్పందన, గెలుపు అవకాశాలపై ఓ అంచనాకు వచ్చినట్లు తెలుస్తుంది…ఇలాంటి ఏ సర్వేలు పాలేరులో షర్మిల టీం నిర్వహించలేదనేది కూడా అనునాయుల మాట…

పాలేరులో అసలు ప్రజలేమి కోరుకుంటున్నరు…?

కాంగ్రెస్ కంచకోటగా, కమ్మ్యూనిస్టులకు వెన్నుముఖగా ఉన్న పాలేరులో తెలుగుదేశం ఓట్లు కూడా గణనీయంగానే ఉన్నాయి… ఇక రెండు టర్ముల టిఆరెస్ పాలనలో, సీనియర్ రాజకీయ నాయకుడు తుమ్మల ఆరంగేటం మరియు ఇక్కడ ఉపఎన్నికలలో శాసన సభ్యులు గా గెలవటంతో కారు పార్టీ కూడా గణనీయమైన ఓటు బ్యాంకు సాధించుకుంది… అయితే గత ఎన్నికలలో కాస్త విలక్షణమైన తీర్పు ఇచ్చారు పాలేరు ప్రజలు. రాష్ట్రంలో అభివృద్ది చెందిన మొదటి నాలుగైదు నియోజక వర్గాలలో పాలేరు ఓకటి… మంత్రిగా, శాసన సభ్యులు గా తుమ్మల వేలకోట్ల నిధులు పాలేరులొ పారించారు… అయినా ఆత్మాభిమానం అంటూ కొందరి తెర వెనుక ప్రయోజనాలతో పాలేరు లో కొత్త అభ్యర్ధిగా పోటీ చేసిన కందాలకు విజయం చేకూర్చారు ప్రజలు… అయితే తాము ఆశించిన ఫలితం పాలేరులో లభించకపోగా, జరుగుతున్న, జరగాల్సిన అభివృద్ధి నిస్తేజంగా మారిపోయింది… ఇప్పుడు ప్రజల ఆలోచనలలో మార్పు వచ్చినట్లుగా తెలుస్తుంది,. కోరుకున్న ఆత్మాభిమానం ఎక్కడికి పోయిందో తెల్వదుకాని, పాలేరులో నయా సామంతుల పాలనలో విసిగి వేసారుతున్నామనేది ప్రజల నుండి వస్తున్న మాట.. దీంతో ఒకసారి ఆత్మాభిమాన మంటూ అభివృద్ధి లో వెనక్కి నెట్టివేయబడ్డ పాలేరులో, అభిమానమనే సెంటిమెంట్ ఎంతవరకు పనిచేస్తుందో తెలియాలి… ఇప్పుడు ప్రజల ఆలోచనలు, ఇప్పటికే అనుభవిస్తున్న ఫలాలతో ఈసారి అభివృద్ధి వైపే పాలేరు ప్రజల చూపు ఉందనేది కాదనలేని సత్యం… ఒక వేళ షర్మిల ను వైయస్సార్ పై అభిమానంతో గెలిపించినా కూడా, ఆమె ఎలాగు రాష్ట్రాన్ని యేలే పరిస్థితులు కనపడకపోవటం, ప్రత్యేకంగా ఆమె ఎమ్మెల్యేగా చేయగలిగే అభివృద్ది ఎమి ఉండదనే అభిప్రాయం ప్రజలలో లేకపోలేదు… కనుక షర్మిల ఆశించిన ఫలితాలు పాలేరులో రాకపోవచ్చు… అయితే వస్తున్న ఉహాగానాల ప్రకారం ఓ జాతీయ పార్టీతో ఆమె పొత్తు పెట్టుకుంటే, అదీ కాంగ్రెస్ తో అయి, ఆ పార్టీ అభ్యర్ధి పాలేరులో లేకుండా ఉంటే మాత్రమే షర్మిల పాలేరులో మెరుగ్గా రాణించవచ్చు…

ఇదే జరిగితే మాత్రం పాలేరు నియోజవర్గంలో రాష్ట్రంలోనే అత్యంత ఖరీదైన ఎన్నికలు చూడవచ్చు… అన్నీ సవ్యంగా సాగి, ఆమె పొత్తులు కలిసిన పార్టీ కూడా ఆమె అభ్యర్దిత్వానికి మద్దతు ఇస్తే,. ఇటీవల రాష్ట్రంలో జరిగిన హుజూరాబాద్ ఉప ఎన్నిక కంటే ఎక్కువ ధన ప్రవాహం జరగొచ్చనేది రాజకీయ విశ్లేషకుల మాట…

సరే పోటీ, పొత్తులు ఎలా ఉన్నా రాజకీయంగా అటు రాష్ట్రంలో, ఇటు జిల్లాలో రాజకీయంగా అనూహ్య పరిణామాలను మాత్రం ఖచ్చితంగా చూడవచ్చు….

News Writen By పి వి నాగిరెడ్డి.

Advertisement