YCP vs Janasena : ఏపీ రోడ్లపై జనసేన డిజిటల్ క్యాంపెయిన్.. వైసీపీ కౌంటర్ అదుర్స్.. జనసేన ప్లాన్ బెడిసికొట్టినట్టేనా?

YCP vs Janasena : ప్రస్తుతం ఏపీలో వైసీపీ వర్సెస్ జనసేన అన్నట్టుగా రాజకీయం నడుస్తోంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు ఏపీలో అంతగా యాక్టివ్ లో లేవు. కేంద్రం నుంచి ఎవరైనా పెద్దలు వస్తే ఏదో హడావుడి చేయడం తప్పితే బీజేపీ పెద్దగా ఏపీలో యాక్టివ్ గా ఉన్న సందర్భాలు లేవు. మరోవైపు కాంగ్రెస్ పరిస్థితి కూడా అంతే. అధికార పార్టీపై విమర్శలు చేయడం తప్పితే.. అంతకు మించి అధికార పార్టీని ఢీకొట్టేంత సత్తా కాంగ్రెస్ కు లేదు. ఇక.. టీడీపీ గురించి పెద్దగా మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు.

Advertisement
ysrcp gives counter to janasena digital campaign
ysrcp gives counter to janasena digital campaign

ఇక.. ఏపీలో తెగ హడావుడి చేస్తున్న పార్టీ జనసేన. పవన్ కళ్యాణ్ సారథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్ పై అన్ని రకాలుగా విమర్శలు చేస్తున్నారు జనసైనికులు. 2024 లో ఎలాగైనా సీఎం కావాలన్న లక్ష్యంతో పవన్ కళ్యాణ్ చాలా యాక్టివ్ అయిపోయారు. అధికార పార్టీని ఇరుకున పెట్టేందుకు ఏపీలోని సమస్యలను వెలికితీయడంతో పాటు.. ఏపీలో అభివృద్ధి ఎక్కడ జరిగింది.. జగన్ సీఎంగా ప్రమాణ స్వీకారం చేశాక.. ఆయన చేసిందేముంది.. రోడ్ల పరిస్థితి ఎలా ఉంది.. ఇలా అన్ని విషయాలపై సోషల్ మీడియాలో క్యాంపెయిన్స్ నిర్వహించడంతో పాటు.. పపన్ కళ్యాణ్ అన్ని ప్రాంతాలను పర్యటిస్తూ.. ప్రజలకు భరోసా ఇస్తున్నారు.

Advertisement

YCP vs Janasena : గుడ్ మార్నింగ్ సీఎం సార్ అంటూ ఏపీ రోడ్ల దుస్థితి ఇది అంటూ జనసేన డిజిటల్ క్యాంపెయిన్

అయితే.. ఇటీవల జనసేన గుడ్ మార్నింగ్ సీఎం సార్ అనే హ్యాష్ ట్యాగ్ తో ఏపీలోని రోడ్ల పరిస్థితిపై డిజిటల్ క్యాంపెయిన్ ప్రారంభించింది. దానికి ఏపీ ప్రజల నుంచి, సోషల్ మీడియా నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. జనసైనికులు అందరూ రోడ్ల మీద గుంతలు ఉన్న చోటుకు వెళ్లి అక్కడ కూర్చొని వాటి ఫోటోలు తీసి, వీడియోలు తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఇదగోండి.. ఇక్కడ రోడ్ల పరిస్థితి చూడండి అంటూ వైసీపీకి, సీఎం జగన్ కు చెబుతున్నారు.

అయితే.. జనసేన డిజిటల్ క్యాంపెయిన్ ను వైసీపీ తిప్పి కొట్టింది. జనసేనకు కౌంటర్ల మీద కౌంటర్లు ఇస్తోంది. అవి చంద్రబాబు నాయుడు హయాంలో వేసిన రోడ్లు. అప్పుడు నాణ్యత లేకుండా రోడ్లను వేయించింది టీడీపీ ప్రభుత్వం. అవి రిపేర్ కి వస్తే.. వాటికి సీఎం జగన్ ఎలా బాధ్యులు అవుతారంటూ లాజిక్ తీస్తున్నారు వైసీపీ నేతలు. జనసేనకు గట్టి కౌంటర్లే వేస్తోంది.

జనసేన డిజిటల్ క్యాంపెయిన్ కు దీటుగా.. కొన్ని చోట్ల రోడ్ల నిర్మాణం కూడా చకచకా జరుగుతోంది. రోడ్ల ప్రారంభోత్సవాలు అంటూ వైసీపీ నేతలు పలు కార్యక్రమాలు నిర్వహిస్తూ జనసేనకు కౌంటర్లు ఇస్తున్నారు. గ్రామాల్లో కూడా నూతన రోడ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. జనసేనకు కౌంటర్ ఇవ్వడం కోసం.. సోషల్ మీడియాలో జనసేన చేసే ప్రచారం అంతా ఉత్తదే అని తేల్చేందుకు వైసీపీ మాత్రం బాగానే ప్రయత్నిస్తోంది. అందుకే.. రోడ్లకు సంబంధించిన పనులను వైసీపీ కూడా హైలెట్ చేస్తోంది.

Advertisement