Chor Bazaar Movie Review : సినిమా పేరు: చోర్ బజార్
నటీనటులు: ఆకాశ్ పూరీ, గెహెన్నా సిప్పీ, సుబ్బరాజు, సునీల్, సంపూర్ణేశ్ బాబు, తదితరులు
డైరెక్టర్: బీ జీవన్ రెడ్డి
ప్రొడ్యూసర్: వీఎస్ రాజు
జానర్ : యాక్షన్
మ్యూజిక్ డైరెక్టర్ : సురేశ్ బొబ్బిలి
విడుదల తేదీ : 24 జూన్ 2022
ఆకాశ్ పూరీ గురించి మాట్లాడుకోవాలంటే అంతకంటే ముందు డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ గురించి మాట్లాడుకోవాలి. అవును.. తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఒక గొప్ప డైరెక్టర్ గా పూరీ ఎంతో పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో గొప్ప చిత్రాలకు ఆయన దర్శకత్వం వహించాడు. స్టార్ హీరోలు, స్టార్ హీరోయిన్లతో సినిమాలు తీసిన ఘనత ఆయనది. తనకు ఇండస్ట్రీలో ఎంత పేరు ఉన్నా.. తన కొడుకు ఆకాశ్ పూరీకి మాత్రం టాలెంట్ తో ఎదిగే చాన్స్ ఇచ్చాడు పూరీ జగన్నాథ్.

చిన్నతనం నుంచే సినిమాలంటే ఆకాశ్ కు ఇంట్రెస్ట్. అందుకే.. తన చిన్నప్పుడు కూడా హీరోల చిన్నతనం క్యారెక్టర్లు వేశాడు ఆకాశ్. ఆ తర్వాత ఆంధ్రా పోరీ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసినప్పటికీ ఆ సినిమా అనుకున్నంతగా ఆడలేదు. ఆ తర్వాత మెహబూబా, రొమాంటిక్ సినిమాల్లోనూ హీరోగా నటించాడు. మూడు సినిమాలు ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయాయి. ఆ తర్వాత చోర్ బజార్ అంటూ తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ఆకాశ్ పూరీ. సినిమా పోస్టర్లు, టీజర్, ట్రైలర్ మాత్రం సినిమాపై ఒక్కసారిగా అంచనాలను పెంచాయి. ఈనేపథ్యంలో ఆకాశ్ పూరీ.. చోర్ బజార్ సినిమాతో హిట్ కొట్టాడా? సినిమా ఎలా ఉంది? అసలు సినిమా స్టోరీ ఏంటి? అనే విషయాలు తెలుసుకుందాం పదండి.
Chor Bazaar Movie Review : కథ ఏంటంటే?
ఈ సినిమాలో మన హీరో అదేనండి ఆకాశ్ పూరీ పేరు బచ్చన్ పాండే. తను చోర్ బజార్ లో ఉంటాడు. అక్కడే మకాం. అల్లరి చిల్లరగా తిరుగుతూ పొట్టకూటి కోసం చిన్నచిన్న దొంగతనాలు చేసుకుంటూ ఉండే ఒక మిడిల్ క్లాస్ కుర్రాడు. బతుకు దెరువు కోసం కార్ల టైర్లను అమ్ముకుంటూ జీవనం సాగిస్తుంటాడు. అప్పుడప్పుడు బంగారం కూడా దొంగతనం చేస్తుంటాడు. అదే సమయంలో తనకు ఒక మూగ అమ్మాయి పరిచయం అవుతుంది. అనే మన హీరోయిన్. సినిమాలో తన పేరు సిమ్రాన్.
మరోవైపు ఆకాశ్ పూరీకి.. డైమండ్ దొంగతనం చేసే పెద్ద డీల్ కుదురుతుంది. అప్పుడే మనోడి లైఫ్ ఒక్కసారిగా టర్న్ అవుతుంది. డైమండ్ దొంగతనం చేయడం వల్ల ఆకాశ్ పూరీ ఎటువంటి సమస్యల్లో చిక్కుకుంటాడు? ఇంతకీ మూగ అమ్మాయి ఎవరు? తనకు, ఆమెకు ఏంటి సంబంధం? మూగ అమ్మాయికి, డైమండ్ కు ఏంటి సంబంధం? ఈ కథలో సంపూర్ణేశ్ బాబు, సునీల్ పాత్రలు ఏంటి? వాళ్లకు, ఆకాశ్ కు ఏంటి సంబంధం? అసలు.. చోర్ బజార్ లో ఏం జరుగుతోంది? అనే విషయం తెలియాలంటే మాత్రం సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.
Chor Bazaar Movie Review : విశ్లేషణ
చోర్ బజార్ సినిమా పేరే చాలా డిఫరెంట్ గా ఉంది. సినిమా కూడా అలాగే ఉంటుంది. సినిమా ప్రారంభమే హీరో ఇంట్రడక్షన్ ఉంటుంది. ఆ తర్వాత ఒక్కో క్యారెక్టర్ ను ఎలివేట్ చేస్తూ వెళ్తుంటాడు డైరెక్టర్. ఆ తర్వాత హీరో, హీరోయిన్ మధ్య లవ్ ట్రాక్. కట్ చేస్తే ఎంతో విలువైన డైమండ్ ను దొంగలించే సీక్వెన్స్. ఆ తర్వాత కొన్ని ఎమోషనల్ సీన్స్. ఇలా సినిమాను చోర్ బజార్ కు కనెక్ట్ చేస్తూ డైరెక్టర్ కథ రాసుకున్నాడు.
అయితే.. ఈ సినిమాను ఆకాశ్ పూరీ తన భుజాన మోసాడు. ఈ సినిమాతో ఆకాశ్ సత్తా ఏంటో తెలిసిపోయింది. తన నటన మొత్తాన్ని బయటికి తీశాడు. కానీ.. కథ మాత్రం అప్పుడప్పుడు యూటర్న్ తీసుకుంది. జార్జ్ రెడ్డి సినిమాతో పాపులర్ అయిన డైరెక్టర్ జీవన్ రెడ్డి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. కానీ.. ఆ సినిమాకు, ఈ సినిమాకు అసలు సంబంధమే ఉండదు. ఇది ఒక సరికొత్త యాక్షన్ ఎంటర్ టైనర్ అని చెప్పుకోవాలి.
ప్లస్ పాయింట్స్
ఆకాశ్ పూరీ నటన
థ్రిల్లింగ్
చోర్ బజార్
లవ్ ట్రాక్
మైనస్ పాయింట్స్
స్టోరీ
డైమండ్ దొంగతనం సీక్వెన్స్
కన్ క్లూజన్
చివరగా చెప్పొచ్చేదేంటంటే.. రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలు కాకుండా.. సరికొత్త యాక్షన్ కమ్ ఎంటర్ టైన్ మెంట్ సినిమాలు చూసేవాళ్లకు ఈ సినిమా ఖచ్చితంగా నచ్చుతుంది. హ్యాపీగా వెళ్లొచ్చు.