Karthikeya 2 Movie Review : కార్తికేయ 2 రివ్యూ.. మంచి టైమ్‌పాస్ చిత్రం

Karthikeya 2 Movie Review : టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ డైరెక్టర్ చందు మొండేటి కాంబినేషన్‌లో థ్రిల్లింగ్ మిస్టరీ కాన్సెప్ట్‌తో రూపొందిన మూవీ కార్తికేయ-2 . 2014లో విడుదలైన కార్తికేయ మూవీకి ఇది సీక్వెల్ కాగా, ఇందులో అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించగా.. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగ‌ర్వాల్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించాయి. అనేకసార్లు వాయిదా పడుతూ వచ్చిన ఈ మూవీ ఎట్టకేలకు నేడు ఆడియన్స్ ముందుకు వచ్చింది. ఈ సినిమా మూవీ ల‌వర్స్‌కి ఎంత‌గా నచ్చిందో తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే..!

Advertisement

క‌థ‌:

Advertisement

నిఖిల్ తొలి పార్ట్‌లో డాక్ట‌ర్‌గా క‌నిపించాడు. సెకండ్ పార్ట్‌లో డాక్టర్ గా కనిపించాడు. డాక్ట‌ర్ పాత్ర అయిన కూడా అడ్వెంచ‌ర్స్‌ని ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతుంటాడు. సినిమా మొత్తం నిఖిల్ పాత్రతోనే నడుస్తుంది. అంతేకాకుండా ఈ సినిమాను నిఖిల్ ఒంటి చేత్తో నడిపించాడు. ఇందులో నిఖిల్ పాత్ర పేరు కార్తీక్ కుమారస్వామి, అనుపమ పాత్ర పేరు ముగ్ధ. ద్వారకలోని శ్రీకృష్ణుని శక్తికి సంబందించిన ఎన్నో విషయాలని బయటకి తీసుకు వ‌చ్చేందుకు నిఖిల్ ఎన్నో ప్ర‌య‌త్నాలు చేస్తుంటాడు. ఆ ప్ర‌య‌త్నాల‌లో ఆయ‌నకు ఎదురైన సంఘ‌ట‌న‌లు ఏంట‌న్న‌ది చిత్రం చూస్తే తెలుస్తుంది.

Karthikeya 2 Movie Review : కార్తికేయ 2 రివ్యూ.. మంచి టైమ్‌పాస్ చిత్రం

Karthikeya 2 Movie Review
Karthikeya 2 Movie Review

నిఖిల్ సినిమా మొత్తం తానై న‌డిపించాడు. డాక్ట‌ర్‌గా ఉంటూనే అడ్వెంచ‌ర‌స్ అంటే ఇష్టం ఉండే పాత్ర‌లో నిఖిల్ ఒదిగిపోయి మెప్పించాడు. అతని పాత్ర‌కు విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. అనుపమ పరమేశ్వరన్ త‌న‌కు ద‌క్కిన డ్యూరేష‌న్ లో అద్భుతంగా న‌టించింది. అనుపమ్ ఖేర్ బాగానే చేసాడు, శ్రీనివాస రెడ్డి కొన్ని సన్నివేశాల్లో తన టైమింగ్‌తో ఖచ్చితంగా నవ్విస్తాడు. ఇతర నటీనటులందరూ కథానుగుణంగా అవసరమైన విధంగా మెప్పించారు

ద‌ర్శ‌కుడు చందూ మొండేటి సినిమాని పీక్స్‌లో తీసుకెళ్లాడు. ఇంట‌ర్వెల్ బ్యాంగ్, స్క్రీన్ ప్లే ఇలాంటి విష‌యాల‌లో మంచి ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రిచాడు. క‌థకు తగ్గట్టుగా పాత్రలను ఎంచుకున్నాడు. ఇక కాలభైరవ అందించిన సంగీతం కూడా బాగా ఆకట్టుకుంది. సన్నివేశానికి తగ్గట్టు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మాత్రం పర్ఫెక్ట్ అని చెప్పవచ్చు. కార్తీక్ ఘట్టమనేని అందించిన సినిమాటోగ్రఫీ కూడా అద్భుతంగా ఉంది.

ఫైన‌ల్‌గా.. థ్రిల్లింగ్ తో పాటు కొత్త కాన్సెప్ట్ తో ముందుకు వచ్చిన కార్తికేయ 2 చిత్రం అభిమానులు మెచ్చే చిత్రం అని చెప్ప‌వ‌చ్చు.అద్భుతమైన విజువల్స్ మరియు మేకింగ్ కోసం థియేటర్లలో మాత్రమే ఈ సినిమా చూడాలి. మంచి కథనంతో సాగుతున్న ఈ సినిమా కథకు జోడించిన మిస్టరీ మరియు ఫాంటసీ అంశాలతో చివరి వరకు మనల్ని కట్టిపడేస్తుంది. ఇంటర్వెల్ బ్లాక్‌లో మంచి ట్విస్ట్ ఉంది . సెకండాఫ్ కూడా ఇదే థ్రిల్‌ని మెయింటైన్ చేస్తుంది.

Advertisement