Polimera 2 Review : పొలిమేర 2 రివ్యూ….

Polimera 2 Review : 2021లో హాట్స్ స్టార్ వేదికగా రిలీజ్ అయిన మా ఊరి పొలిమేర సినిమా ఇప్పుడు రెండవ భాగం థియేటర్స్ లో విడుదలైంది. అయితే ఓటీపీలో రిలీజ్ అయినప్పుడు ఈ సినిమా పెద్ద సంచలనం సృష్టించింది. సత్యం రాజేష్ మరియు బాలాదిత్య కీలకపాత్రలో నటించిన ఈ సినిమా ఓటీటీ వేదికగా సూపర్ డూపర్ హిట్ అయింది. ఈ నేపథ్యంలోనే ఈ సినిమా రెండో పార్ట్ కూడా ఉన్నట్లు అప్పుడే సిని బృందం పట్టించింది. ఈ నేపథ్యంలోనే దాదాపు రెండేళ్ల పాటు పార్ట్ 2 సినిమాకు సమయం కేటాయించి ఇప్పుడు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు. అయితే మొదటి భాగం గురించి మాట్లాడుకుంటే క్లైమాక్స్ లో వచ్చే ట్విస్టులు అదిరిపోతాయి.

Advertisement

polimera-2-review

Advertisement

దీంతో రెండవ భాగం ఎప్పుడు వస్తుందో అంటూ చాలామంది ఆసక్తిగా ఎదురు చూశారు. ఆఖరికి ఈరోజు అక్టోబర్ 3 న పొలిమేర 2 సినిమాను థియేటర్లో రిలీజ్ చేశారు.ఇక ఈ సినిమా తొలి భాగం కంటిన్యూ అవ్వడం వలన మొదటి భాగంలో నటించిన వారే రెండో భాగంలో కూడా ఉన్నారు. సత్యం రాజేష్ ,బాలాదిత్య ,రాకేందు మౌళి, గెటప్ శ్రీను తదితరులు ముఖ్యపాత్రలో నటించి మేపించారు . అనిల్ విశ్వనాథ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు గౌరీ కృష్ణ నిర్మాత గా వ్యవహరించారు. ఈ సినిమా రెండో భాగం కూడా ప్రేక్షకులను బాగా అలరించిందని అర్థమవుతుంది. మరి రెండో భాగం కథ విషయానికొస్తే…

కథ…

కొమురయ్య తన మొదటి ప్రేయసి కవితతో కలిసి కేరళకు పారిపోతాడు. దీనిని తొలి భాగంలో కూడా చూపించడం జరిగింది. అయితే అప్పటికే అడ్రాసుపల్లిలో వరుసగా హత్యలు జరుగుతుంటాయి. ఇదిలా కొనసాగుతుంటే కొమురయ్య తమ్ముడు జంగయ్య కూడా ఆకస్మాత్తుగా కనిపించకుండా పోతారు. ఇక ఇదంత మూఢనమ్మకాల నేపథ్యంలో సాగుతుండగా కథ మొత్తం ఒక్కసారిగా నిధి వైపుకు వెళుతుంది. చాలా విలువైన నిధి కోసమే కొమురయ్య ఈ విధంగా నటిస్తాడని అర్థమవుతుంది. అయితే అసలు అడ్రాసుపల్లిలో నిధి ఎక్కడుంది..? అక్కడికి నిధి ఎలా వచ్చింది..? చీకటి రాజ్యం ఏంటి ..?ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ ఆ నిధిని కనిపెడుతుందా..?కొమురయ్య నిధిని సొంతం చేసుకుంటాడా లేదా అనే కథనంపై సినిమా సాగుతుంది.

విశ్లేషణ…

polimera-2-review

సినిమాలో నటించిన ప్రతి ఒక్కరు కూడా చాలా అద్భుతంగా నటించడం జరిగింది. ఒక్కొక్క పాత్ర ఒక్కో డైమండ్ అనడంలో ఎలాంటి సందేహం లేదు. మొదటి భాగం కంటే కూడా రెండో భాగం ఆసక్తికరంగా ఉంది. ఇక మొదటి భాగంలో ఉన్న కొన్ని విషయాలకు ఈ భాగంలో జవాబులు దొరుకుతాయి. సత్యం రాజేష్ ను మెచ్చుకోవచ్చు. కమెడియన్ గా కాకుండా అన్ని రకాల పాత్రలో ఒదిగిపోయి నటిస్తున్నారు. ఇక సినిమాలో ట్విస్ట్ ల విషయానికొస్తే ప్రతి ఒక్కరు షాక్ అవుతారు. ఎందుకంటే ట్విస్టులు ఊహించిన విధంగా ఉంటాయి. ఒక్కొక్క ట్విస్ట్ ప్రేక్షకులను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఒక సినిమా చివర లో మూడో భాగం కూడా ఉంటుందని డైరెక్టర్ హింట్ ఇచ్చినట్లు అర్థమవుతుంది. సినిమా డైరెక్షన్ పరంగా మరియు బాక్ గ్రౌండ్ మ్యూజిక్ పరంగా అదుర్స్ అని చెప్పుకోవాలి.

Advertisement