The Warriorr Movie Review : రామ్ ‘ది వారియర్’ మూవీ రివ్యూ & రేటింగ్

The Warriorr Movie Review : సినిమా పేరు : ది వారియర్

Advertisement

నటీనటులు : రామ్ పోతినేని, కృతి శెట్టి, ఆది పినిశెట్టి, అక్షర గౌడ, నదియా తదితరులు

Advertisement

నిర్మాత : శ్రీనివాస చిట్టూరి

దర్శకత్వం : లింగుస్వామి

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీప్రసాద్

ఎడిటర్ : నవీన్ నూలి

రిలీజ్ డేట్ : 14 జులై 2022

రిలీజ్ అయిన భాషలు : తెలుగు, తమిళం

రన్నింగ్ టైమ్ : 2 గంటల 35 నిమిషాలు

ram pothineni the warriorr movie review and rating
ram pothineni the warriorr movie review and rating

ఎనర్జటిక్ స్టార్ రామ్ పోతినేని హీరోగా, కృతి శెట్టి హీరోయిన్ గా నటించిన ది వారియర్ మూవీ తాజాగా థియేటర్లలో రిలీజ్ అయింది. జులై 14న అంటే ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా రిలీజ్ అయింది. ఈ సినిమా తెలుగుతో పాటు తమిళంలో కూడా రిలీజ్ అయింది. ది గ్రేట్ తమిళం డైరెక్టర్ ఎన్ లింగుస్వామి దర్శకత్వంలో వచ్చిన సినిమా కావడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. తమిళంలో ఎన్నో గొప్ప చిత్రాలకు దర్శకత్వం వహించిన లింగుస్వామి తొలిసారి తెలుగులో డైరెక్ట్ గా దర్శకత్వం వహించాడు. ఆయన తీసిన అన్ని సినిమాలు తెలుగులో డబ్ అయిన విషయం తెలిసిందే. మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో తెలియాలంటే వెంటనే కథలోకి వెళ్లాల్సిందే.

The Warriorr Movie Review : కథ

ఈ సినిమాలో రామ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. రామ్ పేరు డీఎస్పీ సత్య. హీరోయిన్ కృతి శెట్టి పేరు విజిల్ మహాలక్ష్మి. విలన్ గా నటించిన ఆది పినిశెట్టి పేరు గురు. పోలీస్ ఆఫీసర్ గా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించిన సత్యాను డీఎస్పీగా ప్రమోట్ చేసి కర్నూలుకు బదిలీ చేస్తారు పోలీస్ ఉన్నతాధికారులు. దీంతో డీఎస్పీ సత్యగా కర్నూలులో అడుగు పెడతాడు. కానీ.. అప్పటికే కర్నూలు.. గురు అనే పెద్ద గ్యాంగ్ స్టర్ చేతుల్లో ఉంటుంది. సిటీ మొత్తాన్ని తన ఆధీనంలోకి తెచ్చుకుంటాడు గురు. అక్కడే సత్యకు విజిల్ మహాలక్ష్మి పరిచయం అవుతుంది. తను ఆర్జే. అయితే.. గ్యాంగ్ స్టర్ గురు చేసే చట్టవిరుద్ధ పనులను అడ్డుకోవడం కోసం సత్యకు విజిల్ మహాలక్ష్మి సహకరిస్తూ ఉంటుంది. ఇంతలో ఈ విషయం గురుకు తెలిసి సత్య, విజిల్ మహాలక్ష్మికి హాని తలపెట్టాలని అనుకుంటాడు. ఇంతలో అనుకోని ట్విస్ట్ వస్తుంది. అసలు గురుకు, మహాలక్ష్మికి ఉన్న సంబంధం ఏంటి? గురును పట్టించడం కోసం సత్యకు ఎందుకు సాయం చేస్తుంది? అసలు మహాలక్ష్మి ఎవరు? గురును సత్య ఎలా అంతమొందిస్తాడు? అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.

విశ్లేషణ

ఈ సినిమాను ఫుల్ టు ఫుల్ మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించిన విషయం తెలిసిందే. అయినప్పటికీ ఈ సినిమాలో కామెడీకి కొదవ లేదు. అలాగే.. ఎమోషన్స్ కూడా ఉంటాయి. మరోవైపు ఈ సినిమాలో భారీగా ఉండే యాక్షన్ సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయి. ఇక పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రామ్ అద్భుతంగా నటించాడు. మరో బ్లాక్ బస్టర్ ను తన ఖాతాలో వేసుకున్నాడు రామ్. పోలీస్ ఆఫీసర్ గా యాక్షన్ సీన్స్ లో రామ్ అద్భుతంగా నటించాడు. అలాగే.. సెకండ్ హాఫ్ లో రామ్, ఆది మధ్య వచ్చే ఫైట్ సన్నివేశాలు సినిమాకే హైలైట్ అని చెప్పుకోవచ్చు.

అలాగే.. ఈ సినిమాలో నదియా క్యారెక్టర్ గా ముఖ్యమైనదిగా ఉంటుంది. మొత్తానికి సినిమాను రామ్ తన భుజాల మీద మోశాడు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్, మాస్ అండ్ యాక్షన్ సన్నివేశాలు, ఫైట్స్, డ్యాన్స్ ఈ సినిమాకు ప్లస్ పాయింట్స్ కాగా.. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అయినట్టుగా అనిపిస్తుంది.

ఇక.. విలన్ గా ఆది అద్భుతంగా నటించాడు. ఇప్పటికే సరైనోడు సినిమాతో తనేంటో నిరుపించుకున్నాడు ఆది. ఆ తర్వాత ఈ సినిమాలో విలన్ గా అదరగొట్టేశాడు. హీరోగా పోటీగా నటించి.. సూపర్బ్ అనిపించుకున్నాడు. బుల్లెట్ సాంగ్ కూడా వెండి తెర మీద అదిరిపోయింది.

కన్ క్లూజన్

ఈ సినిమా మాస్ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ ను మెచ్చే ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అలాగే.. ఈ సినిమాలో కామెడీ, ఎమోషన్స్ కూడా బాగా పండాయి కాబట్టి.. ఈ సినిమా అన్ని కేటగిరీల ఆడియెన్స్ కు నచ్చుతుంది.

యువతరం రేటింగ్ : 3.5/5

Advertisement