Ramarao On Duty Movie Review : రామారావు ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ

Ramarao On Duty Movie Review : మాస్ మ‌హ‌రాజా ర‌వితేజ సినిమాలు ప్రేక్ష‌కుల‌కి మాంచి కిక్ ఇస్తాయ‌నే విష‌యం తెలిసిందే. కొంత కాలంగా స‌రైన హిట్స్ లేక చ‌తికిల‌ప‌డ్డ ర‌వితేజ ఈసారి రామారావు ఆన్ డ్యూటీ చిత్రంతో బాక్సాఫీస్ ని షేక్ చేయాల‌ని అనుకుంటున్నాడు. ఈ సినిమాలో రవితేజ డిప్యూటీ కలెక్టర్ పాత్రలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమాను  శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్ మీద సుధాకర్ చెరుకూరి అలాగే రవితేజ టీం వర్క్స్ బ్యానర్ మీద రవితేజ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో దివ్యాంశా కౌశిక్,  రజీషా విజయన్ హీరోయిన్ గా నటించగా అన్వేషీ జైన్ ఒక ఐటెం సాంగ్ లో నర్తించారు. సినిమా కొద్ది సేప‌టి క్రితం విడుద‌ల కాగా, మూవీ రివ్యూ ఎలా ఉందో చూద్దాం.

Advertisement

Ramarao On Duty Movie Review : రామారావు ఆన్ డ్యూటీ మూవీ రివ్యూ

క‌థ‌:

Advertisement

కథ పరంగా చూస్తే, ఈ చిత్రం 1995లో ప్రారంభమవుతుందని తెలుస్తుంది. ఇందులో  రామారావు(రవితేజ) సబ్‌ కలెక్టర్‌గా పనిచేస్తుంటాడు. చట్టానికి లోబడి, న్యాయం కోసం నిలబడే ఆఫీస‌ర్‌గా ర‌వితేజ క‌నిపిస్తాడు. అయితే అనుకోని కార‌ణాల వ‌ల‌న ర‌వితేజ జాబ్ కోల్పోయి సొంత ఊరికి ఎమ్మార్వోగా వెళ్లాల్సి వస్తుంది. అక్కడ కొంత మంది ఊరి ప్రజలు తప్పిపోయారని తెలుసుకున్న రామారావు ఈ మిస్సింగ్ కేసుని ఛేదించడం, ఈ క్రమంలో ఆయన బయటకు తీసిన సంచలన విషయాలు అనేది సినిమా చూస్తూ పూర్తిగా అర్ధ‌మ‌వుతుంది.

Ramarao On Duty Movie Review and rating
Ramarao On Duty Movie Review and rating

సినిమాలో రామారావుగా ర‌వితేజ వ‌న్‌మ్యాన్ షో  చేశాడు.  ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ సినిమాలు చేయడానికి ఎప్పుడూ ఆసక్తిని కనబరుస్తూ రవితేజ ఈ చిత్రాన్ని అంగీకరించినందుకు అభినందించాలి ఈ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్నప్పటికీ రెగ్యులర్ సినిమాల మాదిరిగా కాకుండా ఉంటాయి. ర‌వితేజ‌ లుక్, కాస్ట్యూమ్స్ మరియు బాడీ లాంగ్వేజ్ మొత్తం పాత్రకి అనుగుణంగా మారి ఆ యొక్క పాత్రకి న్యాయం చేసాడు,   వేణు తొట్టెంపూడి, చాలా సంవత్సరాల తర్వాత ఈ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా రీ ఎంట్రీ ఇచ్చాడు, మరియు అతను త‌న పాత్ర ప‌రిది మేర న‌టించాడు. ఇక మిగ‌తా ఆర్టిస్టులు కూడా అద్భుతంగా న‌టించారు.

ఇక టెక్నిక‌ల్ విష‌యానికి వ‌స్తే నిర్మాణ విలువ‌లు ఎక్క‌డా త‌గ్గ‌కుండా సినిమా తెర‌కెక్కించారు. కొన్ని స‌న్నివేశాలు చాలా చ‌క్క‌గా ఉన్నాయి. సంగీత దర్శకుడు సామ్‌ సీఎస్‌ బిజీఎం ఇరగదీశారు. అయితే ఇంట్రడక్షన్‌ డీసెంట్‌గానే ఉందని, ఫస్టాఫ్‌ వరకు కథలో కొత్తదనం ఏం కనిపించక‌పోవ‌డం సినిమాకి కాస్త మైన‌స్ అయ్యే అవ‌కాశం ఉంది. స్క్రిప్ట్ వర్క్, డైరెక్షన్‌ చాలా వీక్‌గా ఉంది. ద‌ర్శ‌కుడికి తొలి సినిమానే కావ‌డంతో పెద్ద‌గా ప్ర‌తిభ క‌న‌బ‌ర‌చ‌లేక‌పోయాడు.

విశ్లేష‌ణ‌:

మాస్ మ‌హ‌రాజా రవితేజ సినిమాలంటేనే ఓ రేంజ్ యాక్ష‌న్ ఉంటుంది. అభిమానుల కోసం సెకండాఫ్‌లో కొన్ని కీల‌క స‌న్నివేశాలు పొందు ప‌రిచారు.ఆ  థ్రిల్లర్‌ ర్యాంపేజ్‌ ఉత్కంఠని గురి చేస్తుంది.  రవితేజ తన మార్క్ యాక్షన్ అదరగొట్టారు. ర‌వితేజ
ఫ్యాన్స్‌కి మాత్రం ఈ సినిమా మంచి ఎంటర్‌టైన్మెంట్ అందించ‌డం ఖాయం.

Advertisement