Sita Ramam Movie Review : సీతారామం మూవీ రివ్యూ.. ఎమోష‌న‌ల్ గా సాగే చిత్రం

Sita Ramam Movie Review : ప్రేమ క‌థా చిత్రాల‌ను చ‌క్క‌గా తెర‌కెక్కించే ద‌ర్శ‌కుడు హ‌ను రాఘ‌వ‌పూడి. ఆయ‌న తెర‌కెక్కించిన చిత్రాల‌లో కొంత వైవిధ్యం ఉంటుంది. తాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన గొప్ప ప్రేమకథ సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక మందన్న కీలక పాత్రలో నటిస్తున్నారు. వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ అందించారు. ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు..ఆ సినిమా ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం.

Advertisement

క‌థ‌:
1985 నేప‌థ్యంలో చిత్రం రూపొంద‌గా, పాకిస్తాన్ మేజర్ అయిన తారిఖ్ తన మనవరాలు అఫ్రీన్( రష్మిక మందాన)కి ఒక ప‌ని చెబుతాడు.ఆ ప‌నిని స‌క్ర‌మంగాపూర్తి చేయాలని సూచిస్తాడు. ఇండియన్ ఆర్మీ లెఫ్టినెంట్ రామ్(దుల్కర్ సల్మాన్) 20 ఇళ్ళ క్రితం రాసిన లెటర్ ని ఇండియాకి చెందిన మహాలక్ష్మి(మృణాళి ఠాగూర్) కి అందించాల‌ని చెబుతాడు. ఈ క్ర‌మంలో అఫ్రీన్ త‌న తాత‌కి ఇచ్చిన మాట కోసం మ‌హాల‌క్ష్మీని వెతికే ప్ర‌క్రియ‌లో ఉంటుంది. ఆ క్ర‌మంలో అనేక ఆటుపోట్లు ఎద‌రువుతుంటాయి, చివ‌రికి లేఖ చేరిందా లేదా, లేఖ‌లో ఏం రాసి ఉంది అనేవి సినిమా చూస్తే తెలుస్తుంది.

Advertisement

Sita Ramam Movie Review : ఎవ‌రెవ‌రు ఎలా చేశారంటే..!

Sita Ramam Movie Review and live updates
Sita Ramam Movie Review and live updates

దర్శకుడు హను రాఘవపూడి రచన, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ చాలా బాగుంది. సాంకేతిక విభాగాలు చెందిన ప్రతీ విభాగం అద్బుతమైన అవుట్‌పుట్ ఇచ్చింది. ఎడిట‌ర్ కొన్ని స‌న్నివేశాలు క‌ట్ చేస్తే బాగుండేది. పిఎస్ వినోద్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. చాలా అందంగా స‌న్నివేశాలు తెర‌కెక్కించాడు. విశాల్ సంగీతం కూడా అద‌రిపోయింది.

ఇక దుల్కర్, మృణాల్‌, ర‌ష్మిక త‌మ పాత్ర‌ల‌లో జీవించేశారు. ఒక్కొక్క‌రు త‌మ పాత్ర‌ల‌కు పూర్తి న్యాయం చేశారు. సినిమాని త‌మ భుజ‌స్కందాల‌పైన వేసుకొని న‌డిపించారు. సినిమాలో ప్ర‌తి పాత్ర కూడా చాలా ఆక‌ట్టుకునేలా ఉంటుంది. సునీల్, వెన్నెల కిషోర్ కామెడీ కూడా బాగుంది.

ఫైన‌ల్ పాయింట్: అంద‌మైన ప్రేమ క‌థా చిత్రాల‌ను ఇష్ట‌ప‌డే వారికి ఈ సినిమా త‌ప్ప‌క న‌చ్చుతుంది. థియేట‌ర్స్‌లో చూడాల్సిన చిత్రం అని చెప్ప‌వ‌చ్చు.

రేటింగ్‌: 2.25/5

Advertisement