Liger Movie Review : సినిమా పేరు : లైగర్
నటీనటులు : విజయ్ దేవరకొండ, అనన్యా పాండే, రమ్యకృష్ణ, రోనిత్ రాయ్, విషు రెడ్డి, అలీ, మకరంద్ దేశ్ పాండే, గెటప్ శీను తదితరులు
డైరెక్టర్ : పూరీ జగన్నాథ్
నిర్మాతలు : పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్, కరణ్ జోహార్, అపూర్వ మెహతా, హిరూ యష్ జోహార్
సినిమాటోగ్రఫీ : విష్ణు శర్మ
మ్యూజిక్ డైరెక్టర్ : అజీమ్ దయాని
చాలా సంవత్సరాల తర్వాత విజయ్ దేవరకొండ నటించిన కొత్త సినిమా లైగర్ రిలీజ్ అయింది. ఈ సినిమా షూటింగ్ కోసమే దాదాపు మూడు సంవత్సరాల సమయం పట్టింది. 2020 లో సినిమా షూటింగ్ ప్రారంభం అయినప్పటికీ కరోనా వల్ల షూటింగ్ లేట్ అవడంతో పాటు రిలీజ్ కూడా లేట్ అయింది. చివరకు ఆగస్టు 25, 2022 న అంటే ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఇప్పటికే ఈ సినిమా ప్రీమియర్స్ ను యూఎస్ లో ప్రదర్శించారు. విజయ్ దేవరకొండ ఫస్ట్ పాన్ ఇండియా మూవీ ఇది. ఒకవేళ ఈ సినిమా సక్సెస్ అయితే విజయ్ మరో పాన్ ఇండియా స్టార్ అవుతాడు. సినిమా రిలీజ్ కంటే ముందు మూవీ యూనిట్ చాలా రోజుల నుంచి ప్రమోషనల్ కార్యక్రమాలలో పాల్గొన్నది. భారీ అంచనాలతో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుందో లేదో తెలియాలంటే సినిమా కథలోకి వెళ్లాల్సిందే.
Liger Movie Review : కథ ఇదే
ఈ సినిమాలో విజయ్ దేవరకొండ పేరు లైగర్. తన తల్లి రమ్యకృష్ణ పేరు బాలామణి. వీళ్లది తెలంగాణలోని కరీంనగర్ ప్రాంతం. కాకపోతే బతకడం కోసం ముంబైకి వెళ్తారు అక్కడ డబ్బులు సంపాదించడం కోసం చాయ్ వ్యాపారాన్ని ప్రారంభిస్తారు. కానీ.. తన కొడుకు కేవలం ఒక చాయ్ అమ్మే వ్యక్తిగానే మిగిలిపోకూడదని బాలామణి భావిస్తుంది. తన కొడుకును పెద్ద బాక్సర్ ను చేయాలని అనుకుంటుంది. కానీ.. బాక్సింగ్ నేర్చుకోవాలంటే చాలా డబ్బులు కావాలి. అప్పుడే తన తండ్రి ఎవరో అసలు నిజాన్ని బయటపెడుతుంది బాలామణి. అసలు లైగర్ తండ్రి ఎవరు? అతడికి బాక్సింగ్ కు మధ్య ఉన్న సంబంధం ఏంటి? బాలామణి వెనుక ఉన్న కథ ఏంటి? చివరకు లైగర్ బాక్సర్ అవుతాడా? ఈ సినిమాలో మైక్ టైసన్ పాత్ర ఏంటి అనే విషయాలు తెలియాలంటే సినిమాను వెండి తెర మీద చూడాల్సిందే.
సినిమా ఎలా ఉంది?
బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ లో తెలుగులో చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. పూరీ తెరకెక్కించిన అమ్మానాన్నా ఓ తమిళ అమ్మాయి, తమ్ముడు, భద్రాచలం లాంటి సినిమాలు తప్పితే పెద్దగా ఇంకా ఎక్కువ సినిమాలు తెలుగులో రాలేదు. కానీ.. లైగర్ ఏదో బాక్సింగ్ సినిమా మాత్రమే కాదు. అంతకుమించి. యాక్షన్ సీక్వెన్సులు, డ్రామా, హీరో క్యారెక్టరైజేషన్ ఇలా అన్నీ కొత్తగా ఉంటాయి.
బాక్సింగ్ సీక్వెన్స్ లు, విజయ్ బాడీ లాంగ్వేజ్, డైలాగ్ డెలివరీ అద్భుతంగా ఉన్నాయి. మిగితా పాత్రల్లో నటీనటులు తమ పాత్రల మేరకు నటించారు. అనన్య పాండే నటనకు అంతగా స్కోప్ లేదు. మొత్తానికి అందరు ప్రేక్షకులు వీక్షించే బాక్సింగ్ డ్రామా ఇది.
యువతరం రేటింగ్ : 2.5/5